Share News

Hyderabad: తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ వ్యక్తి చంద్రబాబు..

ABN , Publish Date - Aug 28 , 2024 | 10:51 AM

తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Andhra Pradesh Chief Minister Chandrababu Naidu) అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జి.భవానీప్రసాద్‌ అన్నారు.

Hyderabad: తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ వ్యక్తి చంద్రబాబు..

- విశ్రాంత న్యాయమూర్తి భవానీప్రసాద్‌

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Andhra Pradesh Chief Minister Chandrababu Naidu) అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జి.భవానీప్రసాద్‌ అన్నారు. వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పలు రంగాల్లో ప్రగతి సాధించేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారని, శ్రమిస్తున్నారని అన్నారు. పాత్రికేయుడు రచించిన చంద్రబాబు ఎక్స్‌ పాయింట్‌ ఎక్స్‌ఓ పుస్తకాన్ని ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో మంగళవారం ఏపీ రెరా మాజీ చైర్మన్‌ డాక్టర్‌ రామనాథ్‌ వెలమటి, మదనపల్లి ఎమ్మెల్యే మహ్మద్‌ షాజహాన్‌ బాషాతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రూ. 1500 కోసం చిన్నారి కిడ్నాప్‌..


అనంతరం జస్టిస్‌ భవానీ ప్రసాద్‌(Justice Bhavani Prasad) మాట్లాడుతూ రచయిత రాజకీయ వివాదాల జోలికి వెళ్లకుండా కేవలం చంద్రబాబునాయుడు ఆలోచనా విధానం, అభివృద్ధి విషయంలో విజన్‌ను మాత్రమే ప్రస్తావించడం అభినందనీయమన్నారు. న్యాయవ్యవస్థలో కొన్ని పనుల నిమిత్తం చంద్రబాబుతో పనిచేసిన అనుభవం తనకు ఉందని తెలిపారు. తెలుగు నేలకు, తెలుగు జాతికి ఏదో ఒక్కటి చేయాలనే ఉద్దేశంతో నిరంతరం తపించిపోతారని అన్నారు. ముఖ్యమంత్రి కాకముందు టీడీపీలో జరిగిన పరిణామాల తాలూకు జాడ తన పాలనలో ఉండకుండా కేవలం ఎన్టీఆర్‌ ఆశయాలను అమలు చేసేందుకు మాత్రమే బాబు కష్టపడుతున్నారన్న విషయం ప్రస్తుత పాలన తీరును చూస్తేనే అర్థం అవుతుందన్నారు.


city5.jpg

1995లో తొలిసారి ముఖ్యమంత్రి(Chief Minister)గా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు ఆనాటి న్యాయశాఖలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందుకోసం ఆయన ఎందరో న్యాయమూర్తుల సలహాలు, సూచనలు తీసుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఆలోచన గురించి పుస్తకం రావడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. ఏపీ రెరా మాజీ చైర్మన్‌ డాక్టర్‌ రామనాథ్‌ వెలమటి మాట్లాడుతూ ఓవైపు వ్యవసాయంపై దృష్టి పెడుతూ మరోవైపు ఇన్ఫాస్ట్రక్చర్‌ను ఎలా అభివృద్ధి చేయాలి.. భవిష్యత్తులో తలెత్తే ముప్పును ఎలా ఎదుర్కోవాలనే విజన్‌తో పనిచేయడం కేవలం చంద్రబాబుకే సాధ్యమన్నారు.


సాఫ్ట్‌వేర్‌ రంగం తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయన స్థలాల కేటాయింపు చేశారని, ఆ అభివృద్ధి ఇప్పుడు అందరూ చూస్తున్నారని తెలిపారు. విభజిత ఏపీని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల సమర్థత కేవలం చంద్రబాబుకే ఉందన్నారు. ఎమ్మెల్యే మహ్మద్‌ షాజహాన్‌ బాషా మాట్లాడుతూ చంద్రబాబుతో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌, నెక్స్‌టెల్‌ మెట సీఈఓ మిక్కిలినేని శ్రీకాంత్‌, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు భవనం షకీలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసూన తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 28 , 2024 | 10:51 AM