Hyderabad: సీఎం స్నేహితుడు మా భూమిని కబ్జా చేశాడు..
ABN , Publish Date - Oct 26 , 2024 | 10:38 AM
కబ్జాదారులకు పోలీసులు అండగా ఉండి వేధింపులకు పాల్పడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జోక్యం చేసుకొని తమ భూమి తమకు అప్పగించాలని బాధితులు వేడుకున్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, ఆయన కుమారుడు రాకేష్ రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, ఉదయ్ శేఖర్‌రెడ్డి, బాధితులు ఎస్.అరుణాదేవి, ఎస్.కృష్ణ మాట్లాడారు.
- సీఎం రేవంత్ జోక్యం చేసుకోవాలని బాధితుల విన్నపం
- నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపణ
హైదరాబాద్ సిటీ: కబ్జాదారులకు పోలీసులు అండగా ఉండి వేధింపులకు పాల్పడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జోక్యం చేసుకొని తమ భూమి తమకు అప్పగించాలని బాధితులు వేడుకున్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, ఆయన కుమారుడు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉదయ్ శేఖర్‌రెడ్డి, బాధితులు ఎస్.అరుణాదేవి, ఎస్.కృష్ణ మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ధన్‌తేరాస్.. పసిడి కొందాం పదా!
మేడ్చల్ మల్కాజిగిరి(Medchal Malkajigiri) జిల్లా తిరుమలగిరిలోని సర్వే నెంబర్లు 398, 399, 409, 410, 411/1, 411/2, 579లోని మొత్తం 19.18 ఎకరాల భూమిని తాము 1968లో కొనుగోలు చేశామని బాధితులు తెలిపారు. అయితే కొంతకాలం క్రితం సీఎం స్నేహితుడు తమ భూమిని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ దాదాపు 100 మంది ఆయుధాలతో తమ స్థలంలో ఉన్నారన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి రెండు సార్లు మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన సూర్యనారాయణరెడ్డి సైతం బాధితుడిగా మారినట్లు వారు తెలిపారు. రాచకొండ సీపీని కలవగా తమనే బెదిరించారని, హన్మంతరావు ద్వారా సీఎం రేవంత్ బ్రదర్స్‌ను కలవాలని చెప్పారని ఆరోపించారు. ఈ విషయంపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు.
తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు
ఈ విషయంపై దర్యాప్తు నడుస్తోందని.. ఈ క్రమంలో కొందరు నిరాధారమైన కథనాలు, వీడియోలు పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాక, పోలీసులపై, ప్రభుత్వ పెద్దలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాచకొండ పోలీసులు(Rachakonda Police) చెబుతున్నారు. ఈ విషయంలో పోలీసులకు, ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదని, తప్పడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కేటీఆర్‌లో వణుకు మొదలైంది: ఆది శ్రీనివాస్
ఈవార్తను కూడా చదవండి: Winter Weather: వణికిస్తున్న చలి పులి..!
ఈవార్తను కూడా చదవండి: jaggareddy: ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి
ఈవార్తను కూడా చదవండి: Kidnap: సంగారెడ్డి ఆస్పత్రిలో కిడ్నాప్.. సంచలనం రేపుతున్న ఘటన..
Read Latest Telangana News and National News