Hyderabad: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Dec 17 , 2024 | 06:45 AM
చలితో నగరవాసులు గజగజ వణికిపోతున్నారు. చలిగాలుల తీవ్రత ఉదయం 9 గంటల వరకు కొనసాగుతుండంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు బయట అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు.

- పటాన్‌చెరులో అత్యల్పంగా 6.4 డిగ్రీలు
- ఉదయం రహదారులను కప్పేస్తున్న పొగమంచు
హైదరాబాద్ సిటీ: చలితో నగరవాసులు గజగజ వణికిపోతున్నారు. చలిగాలుల తీవ్రత ఉదయం 9 గంటల వరకు కొనసాగుతుండంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు బయట అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు. సోమవారం పటాన్‌చెరు(Patancheru)లో 6.4డిగ్రీలు, రాజేంద్రనగర్(Rajendranagar)లో 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: గుడ్డు ప్రియులకు గడ్డుకాలం
సాధారణం కంటే పలు ప్రాంతాల్లో 6నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండటంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లు చలిగాలుల బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఉదయం రహదారులను పొగమంచు కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండురోజుల పాటు గ్రేటర్‌లో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని, పలు ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలులు వీచే పరిస్థితులుంటాయని బేగంపేట వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ముఖాలకు మాస్క్‌లు, స్వెటర్లు..
చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో ముఖాలకు మాస్క్‌లు, స్వెటర్లు లేకుండా ప్రజలు బయటకు రావడం లేదు. ఉదయం 9 గంటల వరకు చలిగాలుల తీవ్రత కొనసాగుతుండటంతో పాటు సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు తీవ్రత ప్రారంభం అవుతోంది. దీంతో ఊటీ తరహా వాతావరణం నగరంలో నెలకొందని గ్రేటర్‌వాసులు అంటున్నారు. చలి పెరగడంతో మాస్క్‌లు, స్వెటర్లకు డిమాండ్ పెరిగింది. చలి తీవ్రత కారణంగా నగరం నుంచి తెల్లవారుజామున దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ బస్టాండ్లలో తగ్గింది. ఉదయం వాకింగ్ కోసం పార్కుల వద్దకు వెళ్లేవారంతా ఆలస్యంగా బయటకు వస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలో గదులు వెచ్చగా ఉండేందుకు రూం హీటర్లను వినియోగిస్తున్నారు.
ప్రాంతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గింది ఇలా..
పటాన్‌చెరు 6.4 -6.7
రాజేంద్రనగర్ 8.5 -4.4
బేగంపేట 11.4 -3.1
హకీంపేట 11.6 -4.4
దుండిగల్ 11.9 -2.3
హయత్‌నగర్ 12 -1.6
పలు ప్రాంతాల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ఈవార్తను కూడా చదవండి: BRS: తండ్రీకొడుకులకు ఝలక్.. కేసీఆర్‌పై కేసు
ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు
ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో
ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న
Read Latest Telangana News and National News