Hyderabad: మ్యాన్‌హోళ్లను తెరిస్తే క్రిమినల్ కేసులు..
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:18 PM
గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)లో ఎక్కడైనా మ్యాన్‌హోళ్ల మూతలు తెరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వాటర్‌బోర్డు(Waterboard) హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవ్వరైనా మ్యాన్‌హోళ్ల మూతలను తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించింది.
- వాటర్‌బోర్డు కఠిన చర్యలు
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)లో ఎక్కడైనా మ్యాన్‌హోళ్ల మూతలు తెరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వాటర్‌బోర్డు(Waterboard) హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవ్వరైనా మ్యాన్‌హోళ్ల మూతలను తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించింది. వర్షాకాలం నేపథ్యంలో.. ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా ఉండేందుకు ఈ సూచనలు చేశారు. వాటర్‌బోర్డు యాక్ట్ -198 9సెక్షన్74 ప్రకారం ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోళ్లపై ఉన్న మూత తెరచినా, తొలగించినా నేరం. దీన్ని అతిక్రమించి, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. నిందితులకు జరిమానా విధించడంతోపాటు కొన్నిసార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశముంది. అయితే నగరంలో ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనిస్తే వెంటనే వాటర్‌బోర్డు కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్‌చేసి సమాచారమివ్వాలని, దగ్గరలోని వాటర్‌బోర్డు కార్యాలయాల్లో నేరుగా సంప్రదించాలని ఎండీ సుదర్శన్‌రెడ్డి సూచించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: వామ్మో.. రూ. 10 కోట్లు కొల్లగొట్టేశారుగా..
నగరంలో ప్రధానంగా వర్షం వస్తే మ్యాన్‌హోళ్లలో పడి మృతి చెందిన ఘటనలున్న నేపథ్యంలో వాటర్‌బోర్డు అప్రమత్తమైంది. మ్యాన్‌హోళ్లను తెరువకుండా నగరవాసుల్లో అవగాహన కల్పించడంతో పాటు హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాకుండా ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు వాటర్‌బోర్డు తీసుకుంది. 25వేలకు పైగా మ్యాన్‌హోళ్లకు సేఫ్టీగ్రిల్స్ బిగించారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్ చేసి, రెడ్ పెయింట్ ఏర్పాటు చేశారు. మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి సీవర్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ఒక సీవరేజీ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు ఉదయాన్నే క్షేత్రస్థాయిలో వారి పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తారు.
జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల అధికారుల సమన్వయంతో పనులు
జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల అధికారుల సమన్వయంతో పనులను చేయనున్నారు. వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆర్టీ), సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్ (ఎస్పీటీ) వాహనాలను రంగంలోకి దింపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలను అందించారు. ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్‌తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది. దీని సాయంతో వర్షపు నీటిని తొలగిస్తారు. చోకేజీ, వాటర్ లాగింగ్ పాయింట్లను జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయంతో ఎప్పటి కప్పుడు క్లియర్ చేస్తారు. వీటితోపాటు ఎయిర్‌టెక్ మిషన్లు సైతం అందుబాటులో ఉన్నాయి. మ్యాన్‌హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలు (సిల్ట్)ని ఎప్పటికప్పుడు తొలగిస్తారు.
ప్రజల్లో విస్తృత అవగాహనకు చర్యలు
వర్షాకాలంలో సీవరేజీ నిర్వహణలో సాధారణ పౌరులు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలనే అంశాలపై వాటర్‌బోర్డు విరివిగా ప్రచారం చేస్తోంది. స్థానిక కాలనీల సంఘాలు, ఎస్‌హెచ్ గ్రూపుల సభ్యులతో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతే కాకుండా చేయాల్సిన, చేయకూడని పనులపై పత్రికలు, టెలివిజన్, ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి సమాయత్తమవుతోంది.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News