Share News

Hyderabad: ధన్‌తేరాస్‌.. పసిడి కొందాం పదా!

ABN , Publish Date - Oct 26 , 2024 | 10:15 AM

భారతీయులకు పసిడిపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. ఏ వేడుక ఉన్నా ఎంతో కొంత బంగారం కొనడం మనకు ఆనవాయితీగా వస్తోంది. ఆడ పిల్లల తల్లిదండ్రులు అయితే బిడ్డ పుట్టినప్పటి నుంచీ పెండ్లి వరకు బంగారం కొంటూనే ఉంటారు. ఫంక్షన్‌ ఏదైనా సరే మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తేనే వారికి సంతోషం. ఈనెల 29వ తేదీన ధన్‌తేరాస్‌ రావడంతో పసిడి దుకాణ దారులు కస్టమర్ల సెంటిమెంట్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు.

Hyderabad: ధన్‌తేరాస్‌.. పసిడి కొందాం పదా!

- ముందే బుకింగ్‌ చేసుకుంటే కస్లమర్లకే లాభం

- ఆఫర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే ప్రయోజనం

- కస్టమర్ల సెంటిమెంట్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో దుకాణ దారులు

- ధర ఒకే.. తరుగు, మజూరీ చార్జీలపై ఓ కన్నేయండి

- హైదరాబాద్:

భారతీయులకు పసిడిపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. ఏ వేడుక ఉన్నా ఎంతో కొంత బంగారం కొనడం మనకు ఆనవాయితీగా వస్తోంది. ఆడ పిల్లల తల్లిదండ్రులు అయితే బిడ్డ పుట్టినప్పటి నుంచీ పెండ్లి వరకు బంగారం కొంటూనే ఉంటారు. ఫంక్షన్‌ ఏదైనా సరే మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తేనే వారికి సంతోషం. ఈనెల 29వ తేదీన ధన్‌తేరాస్‌ రావడంతో పసిడి దుకాణ దారులు కస్టమర్ల సెంటిమెంట్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు. షాపులను అందంగా ముస్తాబు చేయడంతో పాటు ఆఫర్లు అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీంతో ఆ రోజు ఎంతో కొంత బంగారం కొంటే శుభం కలుగుతుందని, లక్ష్మీదేవి ఇంటికి వస్తుందనే నమ్మకం. ధన్‌తేరాస్‌ సందర్భంగా పసిడి కొనుగలుదారుల అవగాహన కోసం ప్రత్యేక కథనం.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ‘మాయా’నైజ్‌.. రుచిగా ఉంటుంది.. తింటే అనారోగ్యమే


ఆఫర్లను పరిశీలిస్తేనే..

బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ధన్‌తేరాస్‌ సందర్భంగా కాస్తోకూస్తో లాభమే అంటున్నారు. పసిడి ధరపై ఎప్పుడూ ఎవ్వరూ డిస్కౌంట్‌ ఇవ్వరన్న విషయం గుర్తుంచుకోవాలి. కస్టమర్లకు తరుగు, మజూరీ చార్జీలపైనే ఎంతో కొంత రాయితీ ఇస్తూ పసిడి అమ్మేస్తుంటారు.

ధన్‌తేరాస్‌ రోజు హడావిడిగా వెళ్లి కొనుగోలు చేసే బదులు.. ఆలోపు మీరు అడ్వాన్స్‌గా నగలు బుకింగ్‌ చేసుకుంటే ఏ రోజు తక్కువ ఉంటే ఆ రోజు ధరకు ఆభరణాలు ఇస్తామని చెప్పడంవల్ల కస్లమర్లకు ప్రయోజనం కలుగుతుంది. గల్లీలో ఉండే దుకాణం మొదలు కొని అంతర్జాతీయంగా వ్యాపారం చేస్తున్న పెద్దపెద్ద పసిడి దుకాణాల వరకు కస్లమర్లను ఆకట్టుకొని సాధ్యమైనంత ఎక్కువ వ్యాపారం చేసేందుకు వారం, పది రోజుల ముందుగానే అడ్వాన్స్‌ బుకింగ్‌ అంటూ ఊరిస్తుంటారు.


కొన్ని బంగారం దుకాణాల్లో తరుగుపై భారీ డిస్కౌంట్స్‌ ఇవ్వగా.. కొన్నింటిలో గోల్డ్‌ కాయిన్స్‌, ఎంత కొంటే అంత బంగారం, క్రెడిట్‌ కార్డ్సుపై కొంటే క్యాష్‌ బ్యాక్‌, పాత బంగారం ఎక్ఛేంజ్‌పై ప్రత్యేక రాయితీలకు శ్రీకారం చుట్టారు. డజన్ల కొద్దీ పసిడి దుకాణాలకు వెళ్లే ఓపిక లేకపోవడంతో ఇంటికి సమీపంలోనే ఏదో ఒక దుకాణంలో కొనుగోలు చేయడంవల్ల నష్టపోవడం ఖాయం. అందుకే కేపీహెచ్‌బీ జాతీయ రహదారికి ఇరువైపుల కిలోమీటరు వ్యవధిలో పేరు గాంచిన జ్యువెలరీ దుకాణాలు ఉన్నాయి. ఆఫర్లతో పాటు మీకు నచ్చిన బంగారు ఆభరణాలను మిగతా రోజులతో పోలిస్తే దంతేరాస్‌ వేడుకల్లో కొనుగోలు చేయొచ్చు.


సెంటిమెంట్‌ కోసమైతే..

ఇప్పుడు బంగారు ఆభరణాలు కొనసాల్సిన అవసరం లేని వ్యక్తులు ధన్‌తేరాస్‌ సెంటిమెంట్‌ కోసమైతే నగలకు బదులు గోల్డ్‌ కాయిన్స్‌ కొనుగోలు చేయొచ్చు. లక్ష్మీదేవి బొమ్మతో కాయిన్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవసరం లేకపోయినా ఆభరణాలు కొని లక్ష రూపాయలకు అదనంగా రూ. 8 వేల నుంచి రూ. 32వేల వరకు వీఏ, మేకింగ్‌ కోసం ఖర్చు పెట్టడం అవసరమా? అదే మీరు కాయిన్‌ కొనడం ఒక్క జీఎస్టీ మినహాయిస్తే తరుగు, మజూరీ చార్జీలు ఏమీ ఉండవు. మీరు ఎప్పుడైనా నచ్చిన డిజైన్స్‌ ప్రకారం ఆ కాయిన్స్‌తో ఆభరణాలు చేయించుకోవచ్చు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కేటీఆర్‌లో వణుకు మొదలైంది: ఆది శ్రీనివాస్‌

ఈవార్తను కూడా చదవండి: Winter Weather: వణికిస్తున్న చలి పులి..!

ఈవార్తను కూడా చదవండి: jaggareddy: ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Kidnap: సంగారెడ్డి ఆస్పత్రిలో కిడ్నాప్.. సంచలనం రేపుతున్న ఘటన..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 26 , 2024 | 10:15 AM