Share News

Hyderabad: ఇక.. తాగునీటికి ఢోకా లేదు..

ABN , Publish Date - May 19 , 2024 | 09:59 AM

ఇటీవల కురిసిన వర్షాలతో హైదరాబాద్‌(Hyderabad) మహా నగరానికి తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి. ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షానికి గోదావరి జలాలు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతుండడంతో నీటిమట్టం పెరుగుతోంది. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌(Ellampalli to Hyderabad)కు గోదావరి జలాలను ఇబ్బందులు లేకుండా తరలించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Hyderabad: ఇక.. తాగునీటికి ఢోకా లేదు..

- వర్షాలతో పెరిగిన గోదావరి జలాలు

- అందుబాటులో 5.72టీఎంసీలు

- అత్యవసర పంపింగ్‌ ఇక లేనట్లే..

హైదరాబాద్‌ సిటీ: ఇటీవల కురిసిన వర్షాలతో హైదరాబాద్‌(Hyderabad) మహా నగరానికి తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి. ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షానికి గోదావరి జలాలు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతుండడంతో నీటిమట్టం పెరుగుతోంది. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌(Ellampalli to Hyderabad)కు గోదావరి జలాలను ఇబ్బందులు లేకుండా తరలించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 5.72టీఎంసీల నీళ్లు ఉండగా ఇవి హైదరాబాద్‌ మహా నగరానికి రెండు నెలల వరకు సరిపోనున్నాయి.

ఇదికూడా చదవండి: Kishan Reddy.G: రేవంత్‌.. హామీలను నెరవేర్చలేరు


హైదరాబాద్‌ మహా నగరానికి రోజూ 750మిలియన్‌ లీటర్ల గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు. మండుటెండలతో ఎల్లంపల్లిలో వివిధ అవసరాలకు అటు ఇరిగేషన్‌ శాఖ, ఇటు వాటర్‌బోర్డు గోదావరి జలాలను వినియోగిస్తుండడంతో నీటిమట్టాలు క్రమంగా తగ్గిపోయాయి. గతేడాది ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో తగినంత నీరు లేదు. ఈ వేసవిలో ఎల్లంపల్లిలో నీటిమట్టాలు ప్రమాదకరస్థాయికి పడిపోతే భారీ మోటర్లతో అత్యవసర పంపింగ్‌ ను ప్రారంభించి నగరానికి నీటి తరలింపులో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వాటర్‌బోర్డు భావించింది. తదనుగుణంగా ఏప్రిల్‌ నెల చివరికే వాటర్‌బోర్డు అధికారులు అత్యవసర పంపింగ్‌కు ఏర్పాట్లు చేశారు.


ఈ నెల 15 నుంచి అత్యవసర పంపింగ్‌ ప్రారంభించడానికి సన్నాహాలు చేశారు. కానీ, ఇటీవల ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన వర్షాలతో దాదాపు 500లకు పైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు తెలిసింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 5.72టీఎంసీల నీళ్లు (461 అడుగులు) ఉండగా హైదరాబాద్‌ మహా నగరానికి రెండు నెలల వరకు సరిపోనున్నాయి. ఈ లోపు వర్షాలు కురిస్తే వాటర్‌బోర్డుకు ఈ ఏడాది వేసవిలో అత్యవసర పంపింగ్‌ అవసరమే ఉండదని ఓ అధికారి తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 19 , 2024 | 09:59 AM