Share News

Hyderabad: ఎన్టీఆర్‌ మార్గ్ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జికి కరెంటు షాక్‌..

ABN , Publish Date - Sep 28 , 2024 | 11:23 AM

ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జికి ఒక్కసారిగా కరెంటుషాక్‌ రావడంతో అక్కడ గప్‌చుప్‌ బండి వద్ద పని చేస్తున్న ఓ యువకుడికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటే అతడిని తప్పించడంతో ప్రాణాపాయం తప్పింది.

Hyderabad: ఎన్టీఆర్‌ మార్గ్ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జికి కరెంటు షాక్‌..

- యువకుడికి గాయాలు

హైదరాబాద్: ఎన్టీఆర్‌ మార్గ్‏లోని ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి వద్ద ఒక్కసారిగా కరెంటుషాక్‌ రావడంతో అక్కడ గప్‌చుప్‌ బండి వద్ద పని చేస్తున్న ఓ యువకుడికి గాయాలయ్యాయి. తృటిలో ప్రాణాపాయం నుంచి అతడిని స్థానికులు తప్పించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి వద్ద గప్‌చుప్‌ బండిని నిర్వహిస్తున్న బాషా అనే వ్యక్తి వద్ద షేక్‌ ముజీబ్‌(Sheikh Mujib) అనే యువకుడు పని చేస్తున్నాడు. గప్‌చుప్‌ బండి వద్ద గిరాకీ లేకపోవడంతో అతడు పక్కనున్న స్తంభానికి ఒరిగి కూర్చుండగా విద్యుత్‌ షాక్‌తో అతడి వీపుపై గాయాలయ్యాయి. అతడి కేకలు విన్న స్థానికులు కర్రల సహాయంతో అతడిని స్తంభం నుంచి దూరంగా వెళ్లేలా చేయడంతో ప్రాణాపాయం నుంచి తప్పిపంచుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: MP Eatala: నిజాం కంటే దుర్మార్గమైన పాలన..


ఈ విషయమై అక్కడి వ్యాపారులు ఏఈ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా వారిద్వారా సీబీడీ వారు స్పందించి సమస్యను పరిష్కరింపజేశారు. సైఫాబాద్‌ ఏఈ మాట్లాడుతూ.. షాక్‌ మొత్తం ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి(Foot over bridge)కి రాలేదని, ఒక ఉడుత అక్కడి 11 కేవీ ఎబీ స్విచ్‌లో పడగా అందులోని బ్రాస్‌ పట్టీ విరిగి ఫీడర్‌ ట్రిప్‌ అయిందని, దాంతో గప్‌చుప్‌ అమ్మే యువకుడు అక్కడి విద్యుత్‌ స్తంభాన్ని ఆనుకోగా కరెంటు షాక్‌ తగిలిందని తెలిపారు. ఈ విషయమై అన్ని విధాలుగా పరిశీలించామని, ఎలాంటి సమస్య లేకుండా చేశామని ఆయన తెలిపారు.


........................................................................

ఈ వార్తను కూడా చదవండి:

..........................................................................

Hyderabad: అమెరికా వీసా వచ్చిందని మద్యం మత్తులో డ్రైవింగ్‌..

- ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీ కొట్టిన కారు

హైదరాబాద్: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీసా వచ్చింది... స్నేహితులు కలిసి పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో ఖరీదైన కారు వేగంగా నడిపి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌(Power transformer)ను ఢీ కొట్టిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‏స్టేషన్‌(Jubilee Hills Police Station) పరిధిలో జరిగింది. పెద్దపల్లికి చెందిన రోహిత్‌ వెంకట్‌ బోయిన్‌పల్లిలో ఉంటున్నాడు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వీసా రావడంతో ఈ నెల 26న స్నేహితులైన చిన్మయి, సీహెచ్‌ సంతోష్‏తో కలిసి ఎంజీ కారులో జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 36లో డౌన్‌టౌన్‌ పబ్‌కు వచ్చారు.

city6.jpg


పీకల దాకా మద్యం తాగి అదే మత్తులో వెంకట్‌ కారు నడిపాడు. రోడ్డు నంబర్‌ 37కు రాగానే కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌ ఎక్కి విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు వెంకట్‌కు డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేయగా 240 బీఎఎం వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: హర్ష సాయి కేసులో కొత్త ట్విస్ట్..

ఇదికూడా చదవండి: కాంగ్రెస్‌కు పోయే కాలం దగ్గర పడింది..

ఇదికూడా చదవండి: మేము నిర్మిస్తే కాంగ్రెస్‌ కూల్చేస్తోంది: కేటీఆర్‌

ఇదికూడా చదవండి: పెద్ద వెంచర్లన్నీ పెండింగ్‌లోనే!

Read Latest Telangana News and National News

Updated Date - Sep 28 , 2024 | 11:23 AM