Share News

Hyderabad: గ్రేటర్‌లో 23 బస్‌ డిపోల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు...!

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:19 AM

గ్రేటర్‌ జోన్‌(Greater Zone)లో ప్రతి బస్‌డిపోలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేదిశగా ఆర్టీసీ పనులు మొదలుపెట్టింది. కంటోన్మెంట్‌, మియాపూర్‌ 1 డిపోలో ఎలక్ర్టిక్‌ బస్సుల చార్జింగ్‌ కోసం ఇప్పటికే ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసిన ఆర్టీసీ, గ్రేటర్‌ జోన్‌లోని మరో 23 బస్‌డిపోల్లో ఈవీ (ఎలక్ర్టికల్‌ వెహికిల్‌) చార్జింగ్‌ స్టేషన్లు జూలై చివరినాటికి అందుబాటులోకి తెచ్చేదిశగా అడుగులేస్తోంది.

Hyderabad: గ్రేటర్‌లో 23 బస్‌ డిపోల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు...!

- ఎలక్ట్రిక్‌ బస్సులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ముందస్తు ఏర్పాట్లు

- హెచ్‌టీ లైన్లతో ఈవీ స్టేషన్‌ పనులు ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ జోన్‌(Greater Zone)లో ప్రతి బస్‌డిపోలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేదిశగా ఆర్టీసీ పనులు మొదలుపెట్టింది. కంటోన్మెంట్‌, మియాపూర్‌ 1 డిపోలో ఎలక్ర్టిక్‌ బస్సుల చార్జింగ్‌ కోసం ఇప్పటికే ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసిన ఆర్టీసీ, గ్రేటర్‌ జోన్‌లోని మరో 23 బస్‌డిపోల్లో ఈవీ (ఎలక్ర్టికల్‌ వెహికిల్‌) చార్జింగ్‌ స్టేషన్లు జూలై చివరినాటికి అందుబాటులోకి తెచ్చేదిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం గ్రేటర్‌జోన్‌లో 62 ఎలక్ర్టిక్‌ బస్సులు నడుస్తుండగా మరో 20 ఎలక్ర్టిక్‌ బస్సులు జూన్‌ చివరినాటికి అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడ్డాకే.. తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లు ఉంది


ఎలక్ర్టిక్‌ బస్సుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో హెచ్‌సీయూ, ముషీరాబాద్‌, కూకట్‌పల్లి(HCU, Mushirabad, Kukatpally), బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్‌-1తో పాటు ఫలక్‌నుమా, ఫరూక్‌నగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, బండ్లగూడ, హయత్‌నగర్‌-1, హయత్‌నగర్‌-2, మిథాని, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చెంగిచెర్ల, కుషాయిగూడ, జీడిమెట్లతో పాటు అన్ని బస్‌ డిపోల్లో ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. జూలై చివరినాటికి బస్‌డీపోల్లో దశలవారీగా ఈవీ స్టేషన్ల ప్రారంభానికి ఆర్టీసీ చర్యలు చేపట్టింది. జిల్లా బస్సుల కోసం పలు డిపోలు, సిటీబస్సుల కోసం మరికొన్ని బస్‌డిపోల్లో ఈవీ స్టేషన్లను కేటాయించేలా ఏర్పాట్లు చేస్తోంది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 02 , 2024 | 11:19 AM