Hyderabad: చాయ్ నుంచి చికెన్65 వరకు.. 35% కల్తీయే..
ABN , Publish Date - Nov 09 , 2024 | 08:13 AM
నగర వీధుల్లో విక్రయిస్తున్న ఆహార పదార్థాలు (స్ట్రీట్ ఫుడ్) 35శాతం కల్తీతో కూడినవని తేలింది. వీధుల్లో విక్రయిస్తున్న స్ర్టీట్‌ఫుడ్‌కు సంబంధించి గత రెండేళ్లలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అధికారులు 4,528 నమూనాలు సేకరించి మొబైల్ ల్యాబ్‌లో పరీక్షించారు. ఇందులో 35శాతం నాణ్యత లేని, సురక్షితం కాని ఆహారం ఉన్నట్టు గుర్తించారు.
- రంగు కోసం టీపొడిలో గ్రాన్యూర్..
- సాస్‌లో నీళ్లు.. నాసిరకం పాలు
- వాడిన ఆయిల్ మళ్లీ మళ్లీ వినియోగం
- టీపీసీ అధికం.. క్యాన్సర్‌కు కారకం
- రోడ్ల పక్కన నాణ్యత లేని ఆహారం
- సురక్షితం కాని తాగునీరు..
- జీహెచ్‌ఎంసీ మొబైల్ ల్యాబ్ పరీక్షల్లో గుర్తింపు
హైదరాబాద్ సిటీ: నగర వీధుల్లో విక్రయిస్తున్న ఆహార పదార్థాలు (స్ట్రీట్ ఫుడ్) 35శాతం కల్తీతో కూడినవని తేలింది. వీధుల్లో విక్రయిస్తున్న స్ర్టీట్‌ఫుడ్‌కు సంబంధించి గత రెండేళ్లలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అధికారులు 4,528 నమూనాలు సేకరించి మొబైల్ ల్యాబ్‌లో పరీక్షించారు. ఇందులో 35శాతం నాణ్యత లేని, సురక్షితం కాని ఆహారం ఉన్నట్టు గుర్తించారు. తనిఖీలు నిర్వహిస్తున్నా.. అప్పుడప్పుడు జరిమానా విధిస్తున్నా.. మెజార్టీ వ్యాపారుల్లో మార్పు కనిపించడం లేదు. ప్రజారోగ్యం కంటే లాభార్జనే ధ్యేయంగా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Kishan Reddy: వీధిలైట్లు ఎందుకు వెలగడం లేదు.. పాడైపోతే.. కొత్త వాటిని బిగించరా..
అక్కడికక్కడే పరీక్షలు..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) ఆదేశాల మేరకు నగరంలో ఆహార కల్తీ నియంత్రణకు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ పేరిట జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మొబైల్ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. నగరంలో స్ట్రీట్‌ఫుడ్‌ను విక్రయిస్తున్న వ్యాపారుల వద్దకు వెళ్లి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి కల్తీ అయిందా లేదా అనేది తేల్చేస్తున్నారు. ఇలా నవంబర్ 2022 నుంచి మొబైల్ ల్యాబ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో 4,500లకు పైగా స్ర్టీట్ ఫుడ్‌కు సంబంధించిన పరీక్షలు ఇప్పటివరకు నిర్వహించారు.
లాభార్జన కోసం వీధివ్యాపారుల్లో కొందరు కల్తీలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. చాయ్ రంగు కోసం గ్రాన్యూర్ వాడుతున్నారు. సాధారణంగా వేడి నీటిలో టీపొడి వేస్తే రంగు వస్తుంది. కానీ, కొందరు వాడుతోన్న టీ పౌడర్‌ను చల్లటి నీటిలో వేసినా రంగు మారుతున్నట్టు గుర్తించారు. అలాగే తక్కువ ధరకు వచ్చే పాలను వినియోగిస్తున్నారు. కొన్నింటికి ఐఎ్‌సఐ ముద్ర కూడా ఉండడం లేదని గుర్తించారు. సాస్‌లో నీళ్లు కలుపుతుండడంతో టోటల్ సొల్యూబుల్ సాలిడ్స్(టీఎస్ఎస్) నిర్ణీత స్థాయి (18 నుంచి 25 శాతం) కంటే తక్కువగా ఉంటున్నాయి. పలుచోట్ల తాగునీరూ సురక్షితంగా లేదని గుర్తించారు. నీటిలో పీహెచ్ (పొటెన్షియల్ హైడ్రోజన్) స్థాయి 6-7 మధ్య ఉండాలి. కానీ, కొందరు వినియోగిస్తోన్న నీటిలో పీహెచ్ స్థాయి అంతకంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటోంది. ఇటువంటి నీటితో ఎసిడిటి, టైఫాయిడ్, వాంతులు, విరేచనాలు వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఆయిల్‌తో క్యాన్సర్..
వీధి ఆహార విక్రయాల్లో ఎక్కువగా ఫ్రై చేసిన పదార్థాలే ఉంటాయి. ఉదయం టిఫిన్‌లో భాగంగా విక్రయించే పూరీ, వడ, మైసూర్ బజ్జీ వంటి వాటితోపాటు మిర్చీలు, పునుగులు, ఇతర బజ్జీలు, చికెన్, ఫిష్ ఫ్రై కోసం నూనె వాడుతున్నారు. సాధారణంగా నల్లరంగు రాక ముందే నూనెను మార్చాలి. కానీ మెజార్టీ వ్యాపారులు అందుకు విరుద్ధంగా వాడిన నూనెలోనే కొత్త ఆయిల్ పోస్తున్నారు. ఎక్కువ సమయం నూనె మరిగిస్తుండడంతో టోటల్ పొలార్ కాంపౌండ్ (టీపీసీ) పెరుగుతోంది. ప్రమాణాల ప్రకారం టీపీసీ 25లోపు ఉండాల్సి ఉండగా అది 30 వరకు ఉంటోందని ఓ ఫుడ్‌సేఫ్టీ అధికారి తెలిపారు. ఇది క్యాన్సర్, శ్వాసకోస సంబంధిత వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. కారంలో ఇటుక పొడి, పసుపులో రంగు అద్దిన పిండి వాడుతున్నట్టు కొన్నిచోట్ల గుర్తించారు. పలువురు వ్యాపారులు నాసిరకం అల్లంవెల్లుల్లి మిశ్రమం వినియోగిస్తున్నట్టు పరీక్షల్లో తేలింది.
నామమాత్రపు జరిమానాతో ఆగని కల్తీ..
జీహెచ్‌ఎంసీలో ఒకే మొబైల్ ల్యాబ్ ఉంది. రోజుకో జోన్ చొప్పున ఆరు జోన్లలోని నిర్ణీత ప్రాంతాల్లో స్థానిక ఫుడ్‌సేఫ్టీ(Food Safety) అధికారుల నేతృత్వంలో పరీక్షలు చేస్తున్నారు. నాణ్యత లేని పదార్థాలు వినియోగించవద్దని 2022 నుంచి ఇప్పటి వరకు 304 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. టెస్ట్‌ల్లో నాణ్యత లోపించినట్టు గుర్తిస్తే నామమాత్రపు జరిమానా విధిస్తున్నారు. ఒక్కో ఉల్లంఘనకు రూ.100 చొప్పున జరిమానా విధిస్తుండడం. ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో వ్యాపారులూ ఆహార కల్తీ ఆపడం లేదు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మెడికల్ రీయింబర్స్‌మెంట్.. ఆన్‌లైన్‌లోనే!
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: బెంగళూరులో ముగిసిన ‘హైడ్రా’ పర్యటన
ఈవార్తను కూడా చదవండి: jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే
Read Latest Telangana News and National News