Share News

Hyderabad: జీహెచ్‌ఎంసీ ఆస్తులను డిజిటలైజ్‌ చేయాలి..

ABN , Publish Date - Jun 26 , 2024 | 10:54 AM

జీహెచ్‌ఎంసీ ఆస్తులను డిజిటలైజ్‌ చేయాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) అధికారులను ఆదేశించారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎస్టేట్‌ అదనపు కమిషనర్‌ కోట శ్రీవాత్సవ(Additional Commissioner of Estate Kota Srivatsava)తో ఆమె మంగళవారం సమీక్షించారు.

Hyderabad: జీహెచ్‌ఎంసీ ఆస్తులను డిజిటలైజ్‌ చేయాలి..

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ ఆస్తులను డిజిటలైజ్‌ చేయాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) అధికారులను ఆదేశించారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎస్టేట్‌ అదనపు కమిషనర్‌ కోట శ్రీవాత్సవ(Additional Commissioner of Estate Kota Srivatsava)తో ఆమె మంగళవారం సమీక్షించారు. వాణిజ్య సముదాయాలు, ఖాళీ స్థలాలు, ఇతర ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన పూర్తి రికార్డులు ఉన్నాయా? అద్దెలు సక్రమంగా వసూలవుతున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు.

ఇదికూడా చదవండి: Shantikumari: గ్రేటర్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతాల విలీనానికి సిద్ధం..


వాణిజ్య సముదాయాలు, ఇతర ఆస్తుల ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లీజు గడువు ముగింపునకు సంబంధించి ముందుగా అలర్ట్‌ వచ్చేలా ఆన్‌లైన్‌లో మార్పులు చేయాలన్నారు. కమ్యూనిటీ హాళ్లపై నివేదిక ఇవ్వాలని సూచించారు. మోడల్‌ మార్కెట్లలో ఎన్ని దుకాణాలను అద్దెకిచ్చారు..? ఎన్ని ఖాళీగా ఉన్నాయన్న వివరాలూ సమర్పించాలన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 10:55 AM