Hyderabad: హలో.. మీరు సీసీ కెమెరాల్లో కనిపిస్తున్నారు
ABN , Publish Date - Nov 19 , 2024 | 08:56 AM
పారిశుధ్య సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు వినూత్న ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, మైకులను ఏర్పాటు చేసి రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు చేపట్టారు. తద్వారా మంచి ఫలితాలు వస్తుండడంతో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు మరికొన్ని చోట్ల ఇలాంటి ఏర్పాట్లు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
- రోడ్డుపై చెత్త వేస్తున్నారా... నీ ఫొటో చిక్కినట్టే..
- సీసీ కెమెరాల ఏర్పాటుతో పారిశుధ్య సమస్యకు చెక్
- మంచి ఫలితాలు వస్తున్నాయంటున్న జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు
హైదరాబాద్: పారిశుధ్య సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు వినూత్న ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, మైకులను ఏర్పాటు చేసి రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు చేపట్టారు. తద్వారా మంచి ఫలితాలు వస్తుండడంతో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు మరికొన్ని చోట్ల ఇలాంటి ఏర్పాట్లు చేసేందుకు సిద్ధపడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ సర్కిల్-15 పరిధిలోని ముషీరాబాద్‌లో పారిశుధ్య సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించి ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను, మైకులను ఏర్పాటు చేసి చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 66 గజాలు.. 6 అంతస్తులు
మొదటి విడుతలో భాగంగా ముషీరాబాద్ డివిజన్(Musheerabad Division)లోని పార్శిగుట్ట చౌరస్తా, అడిగ్‌మెట్ డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ చెత్తవేయకండి.. అంటూ మైక్‌లో వినిపించేలా రికార్డింగ్ వాయిస్‌ను ఏర్పాటు చేయడంతో ఈ రెండు ప్రాంతాలు పారిశుధ్య సమస్య తలెత్తడం లేదు. దీంతో ఈ ప్రయోగం మంచి ఫలితాలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
చెత్త వేస్తే చలానా విధిస్తాం
‘హలో.. మీరు సీసీ కెమెరాలో కనిపిస్తున్నారు. ఇక్కడ చెత్త వేయకండి... వేస్తే చలానా విధిస్తాం’ అంటూ రికార్డింగ్ చేసిన వాయిస్ మైక్‌లో వినిపిస్తుండడంతో చెత్తవేయడం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. సీసీ కెమెరాలు అటుగా వెళ్లేవారిని స్కాన్ చేసి చెత్తవేసేందుకు వచ్చిన వారిని గుర్తించగానే మైక్‌లు రికార్డింగ్ వాయి్‌సను వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు భయంతో చెత్తవేయడం లేదు.
మంచి ఫలితాలు వస్తున్నాయి
సీసీ కెమెరాలు, మైక్‌ల ద్వారా రికార్డింగ్ వాయిస్ వస్తుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. భోలక్‌పూర్‌లో పారిశుధ్య సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలలో వాయి్‌సతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
- ఎస్‌ఎఫ్ఏ హరినాథ్, భోలక్‌పూర్
త్వరలో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు
పారిశుధ్య సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించాం. అక్కడ కూడా త్వరలో వాయిస్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. భోలక్‌పూర్‌లోని దేవుని తోట వద్ద సమస్య అధికంగా ఉంది. అక్కడ కూడా సీసీ కెమెరాలు త్వరలో ఏర్పాటు చేస్తాం. ప్రజలు సామాజిక బాధ్యతతో ఇంటి చెత్తను చెత్తను కార్మికులకు అందజేయాలి. స్వచ్ఛ హైదరాబాద్‌కు సహకరించాలి. సీసీ కెమెరాలో రికార్డైయిన చెత్త వేసే వ్యక్తులను, వాహనాలను గుర్తించి వారికి చలాన్‌లు రాస్తున్నాం.
- డాక్టర్ ప్రవీణ, జీహెచ్‌ఎంసీ సర్కిల్-15 ఏఎంవోహెచ్
ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్ పరిస్థితే లగచర్లలోనూ..
ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్ హయాంలో సర్వేతో దోపిడీ
ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్ ప్రవర్తన
Read Latest Telangana News and National News