Hyderabad: హమ్మయ్య.. ప్రశాంతంగానే ముగిసిందిగా...
ABN , Publish Date - Jun 05 , 2024 | 09:48 AM
నిఘా నీడలో, పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ(Parlament, Cantonment Assembly) ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నగరంలో మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.
హైదరాబాద్ సిటీ: నిఘా నీడలో, పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ(Parlament, Cantonment Assembly) ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నగరంలో మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. పార్టీల కార్యకర్తలు, అభ్యర్థుల అనుచరులు ఎక్కడపడితే అక్కడ గుమికూడకుండా చెదరగొట్టారు. ట్రై కమిషనరేట్ పరిధిలో వైన్‌షాపులు 24 గంటలూ బంద్ చేయాలని సీపీలు ముందస్తుగా ఆదేశించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో వార్ వన్‌సైడ్..
200 మీటర్ల దూరం వరకు ప్రజలు గుమికూడవద్దని, ఎలాంటి మీటింగ్‌లు పెట్టడానికి వీల్లేదని వెల్లడించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేలా బందోబస్తు నిర్వహించడంలో సక్సెస్ అయ్యారు. కౌంటింగ్ ప్రాంతాలను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(Hyderabad CP Kottakota Srinivas Reddy), రాచకొండ సీపీ తరుణ్‌జోషి, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ప్రత్యక్షంగా పర్యవేక్షించి, ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భద్రత, బందోబస్తు పరిస్థితిని సమీక్షించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News