Share News

Hyderabad: బల్దియాలో ఇంటి దొంగలు.. రూ.కోట్లు కొల్లగొట్టిన బిల్‌ కలెక్టర్లు

ABN , Publish Date - Aug 03 , 2024 | 11:45 AM

బల్దియా ఖజానాను ఇంటిదొంగలు కొల్లగొట్టారు. వసూలు చేసిన పన్నును కొందరు బిల్‌కలెక్టర్లు(Bill collectors) జేబులో వేసుకుంటే.. చేసిన పనులకు మించి కాంట్రాక్టు సంస్థలకు ఇంజనీర్లు బిల్లులు చెల్లించారు. ఆస్తిపన్ను మదింపు, ట్రేడ్‌ రుసుము నిర్ధారణ.. ఇలా అన్నింటా అవకతవకలకు పాల్పడ్డారు.

Hyderabad: బల్దియాలో ఇంటి దొంగలు.. రూ.కోట్లు కొల్లగొట్టిన బిల్‌ కలెక్టర్లు

- పన్ను వసూళ్లు ఖజానాలో జమచేయని వైనం

- ఒకే పీటీఐ వేర్వేరు భవనాలకు కేటాయింపు

- 2019-20, 2020-21 రాష్ట్ర ఆడిట్‌ రిపోర్టులో వెలుగులోకి..

హైదరాబాద్‌ సిటీ: బల్దియా ఖజానాను ఇంటిదొంగలు కొల్లగొట్టారు. వసూలు చేసిన పన్నును కొందరు బిల్‌కలెక్టర్లు(Bill collectors) జేబులో వేసుకుంటే.. చేసిన పనులకు మించి కాంట్రాక్టు సంస్థలకు ఇంజనీర్లు బిల్లులు చెల్లించారు. ఆస్తిపన్ను మదింపు, ట్రేడ్‌ రుసుము నిర్ధారణ.. ఇలా అన్నింటా అవకతవకలకు పాల్పడ్డారు. ఒకే ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ (పీటీఐ) నంబర్‌ను వేర్వేరు ఆస్తులకు కేటాయించి సంస్థకు ఆర్థికంగా నష్టం చేశారు. ఇందుకు రాష్ట్ర ఆడిట్‌ (2019-20, 2020-21)లో వెల్లడించిన అంశాలే నిదర్శనం. ప్రధానంగా రెవెన్యూ వసూళ్లలో భారీ మొత్తాలు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించింది. గతంలో తీసుకున్న అడ్వాన్సులు చాలా ఏళ్లుగా సర్దుబాటు కాకుండా ఉన్నాయని చెప్పింది.

ఇదికూడా చదవండి: Hyderabad: నెలలో మూడింతలైన ‘డెంగీ’...


నివేదికలోని ముఖ్యాంశాలు..

- జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి సర్కిల్‌లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం అంచనాల్లో లేని పనుల్లో చేశారని గుర్తించింది. ఇక్కడ రూ.1,35,266 దుర్వినియోగమైనట్లు వెల్లడించింది.

- ముషీరాబాద్‌ సర్కిల్‌లో 2019 ఏప్రిల్‌ 29 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు పన్నుల రూపంలో సేకరించిన రూ.4,90,134లో రూ.79,200 జమ చేయకుండా బిల్‌ కలెక్టర్లు దగ్గర ఉంచుకున్నట్లు చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

- జీహెచ్‌ఎంసీ అల్వాల్‌ సర్కిల్‌లో అడ్వాన్సులను ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌కు డ్రా చేశారు. ఇక్కడ రూ. 11,85,757లు రికవరీ చేయాలని ఆడిట్‌ ఆదేశించింది.

ఇదికూడా చదవండి: Hyderabad: థాంక్యూ సీఎం సార్‌..


- చాంద్రాయణగుట్ట సర్కిల్‌లో రూ.2,31,130 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ద్వారా అడ్వాన్సులు చెల్లించారు. ఆడిట్‌ ముగిసే వరకు కూడా మొత్తం సర్దుబాటు కాలేదని, చెల్లించిన మొత్తాలను రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

- గోషామహల్‌ సర్కిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోని ఫైళ్లపరిశీలనలో రూ.99,96,882 ఓచర్‌ ద్వారా డ్రా చేసినట్లు గుర్తించింది.

- శేరిలింగంపల్లి జోన్‌ చందానగర్‌ సర్కిల్‌లో ఆన్‌లైన్‌ సమాచారం ధ్రువీకరణపై రూ.1,75,67,49 వివిధ సంస్థలు, కాంట్రాక్టర్లు, సంబంధిత విభాగాలకు అడ్డాన్స్‌గా చెల్లించారు. అయితే ఆడిట్‌ ముగిసే వరకు ఈ మొత్తాలను సర్దుబాటు చేయకపోవడంతో పాటు తిరిగి ఇవ్వలేదని వెల్లడించింది.


- జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి సర్కిల్‌లో ఇంజనీరింగ్‌ విభాగం నీటి నిర్వహణకు రూ.45,30,004 చెల్లింపులు చేయడం ఆమోదయోగ్యంగా లేదని విశ్లేషించింది.

- హయత్‌నగర్‌ సర్కిల్‌లో అసె్‌సమెంట్‌లో చూపించిన ప్లింత్‌ ఏరియా టిన్‌ జనరల్‌ లిస్టులో చూపించిన ప్లింత్‌ ఏరియా కంటే తక్కువగా ఉందని, దీంతో ఆస్తిపన్ను ద్వారా వచ్చే రాబడికి రూ.11,71,523 నష్టం జరిగిందని ఆడిట్‌ రిపోర్ట్‌ పేర్కొన్నది.

- ప్రధానంగా కొందరు బిల్‌ కలెక్టర్లు వసూలు చేసిన పన్నులను సొంతంగా వాడుకున్నట్లు వివరించింది.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Updated Date - Aug 03 , 2024 | 11:45 AM