Hyderabad: హైడ్రా.. ఆపరేషన్ నాలా..!
ABN , Publish Date - Sep 07 , 2024 | 01:10 PM
వర్షాలు.. ముంపు ముప్పు నేపథ్యంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వరద నీటి నిర్వహణ మెరుగుదలపై దృష్టి సారించింది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగిస్తూనే, ఆపరేషన్ నాలా కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.
- వరద ప్రవాహ వ్యవస్థ అడ్డంకుల తొలగింపుపై నజర్
- ముంపు ముప్పు నేపథ్యంలో ప్రాధాన్యత
- రాంనగర్‌లోని మణెమ్మ బస్తీ తరహాలో చర్యలు
- సమాచారమివ్వాలని కోరుతోన్న ఏజెన్సీ
- సోమవారం నుంచి బుద్ధభవన్‌లో ప్రత్యేక కౌంటర్
హైదరాబాద్ సిటీ: వర్షాలు.. ముంపు ముప్పు నేపథ్యంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వరద నీటి నిర్వహణ మెరుగుదలపై దృష్టి సారించింది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగిస్తూనే, ఆపరేషన్ నాలా కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. నాలాల్లో వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తోంది. నాలాలకు అడ్డుగా ఉన్న, కబ్జా చేస్తు చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని పౌరులను కోరుతోంది. రాంనగర్(Ramnagar)లోని మణెమ్మ బస్తీలో స్థానికుల ఫిర్యాదు మేరకు పలు ప్రభుత్వ విభాగాలు ఇటీవల ఆక్రమణలు తొలగించాయి. అదే తరహాలో ఇతర ప్రాంతాల్లోనూ చర్యలు చేపట్టాలని హైడ్రా భావిస్తోంది. జీహెచ్‌ఎంసీ(GHMC)తోపాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ఏరియాల్లో నాలాల విస్తరణకు ప్రస్తుతం ప్రాధాన్యతమిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: బాలాపూర్ గణేశ్.. వెరీ స్పెషల్
నాలాలకు అడ్డుగా..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 370 కి.మీల మేర మేజర్ నాలాలు, 1250 కి.మీల వరద నీటి కాలువలు (స్ర్టామ్ వాటర్ డ్రైన్) ఉన్నాయి. వీటి ప్రవాహ వ్యవస్థ సామర్థ్యం గంటకు 2 సెం.మీలు మాత్రమే . కొన్నాళ్లుగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతోన్న నేపథ్యంలో రహదారులు జలమయమవుతున్నాయి. నాలాల పక్కనున్న కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయి. పట్టణీకరణ నేపథ్యంలో నగరంలో పరిస్థితులు మరింత తీసికట్టుగా మారుతున్నాయి. ఈ ఇబ్బందులకు చెక్‌పెట్టేలా హై-సిటీ కార్యక్రమంలో భాగంగా నాలాల విస్తరణ, అ భివృద్ధి పనులు చేపడుతున్నారు. దీనికి సమాంతరంగా ఆక్రమణల తొలగింపూ చేపట్టాలన్నది సర్కారు యోచనగా తెలుస్తోంది.
ఈ క్రమంలో దీర్ఘకాలంగా ఉంటోన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా నివాసేతర నిర్మాణాలను మాత్రమే తొలగించాలని నిర్ణయించారు. గతంలో జీహెచ్‌ఎంసీ నిర్వహించిన సర్వేలో నగరంలోని నాలాలపై 12 వేలకుపైగా ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో దాదాపు 35 శాతం వరకు నివాసేతర నిర్మాణాలే. నాలాలకు అడ్డంగా రెండు, మూడంతస్తుల భవనాలు నిర్మించారు. కొన్నిచోట్ల 30 అడుగుల వెడల్పు ఉన్న నాలాలు.. పది అడుగుల లోపునకు కుచించుకుపోయాయి. ఇంకొన్ని చోట్ల నాలాలు రెండు, మూడు అడుగుల కంటే వెడల్పు లేకపోవడం గమనార్హం. దీంతో పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. నాలాల సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లు అవసరమని గతంలో ప్రణాళికలు రూపొందించారు.
నిధుల కొరత, ఆక్రమణల తొలగింపు, పునరావాసం తదితర ఇబ్బందుల నేపథ్యంలో కార్యరూపం దాల్చలేదు. ‘నివాసేతర ఆక్రమణల తొలగింపు ద్వారా వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం’ అని హైడ్రా వర్గాలు చెబుతున్నాయి. చెరువుల్లో ఆక్రమణల ఫిర్యాదులనూ హైడ్రా పరిశీలిస్తోంది. చెరువులను రంగనాథ్ పరిశీలిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో పలు చెరువుల్లో నీటి నిల్వల ఆధారంగా ఎఫ్‌టీఎల్‌ను సూత్రప్రాయంగా అంచనా వేస్తున్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read LatestTelangana NewsandNational News