Share News

Hyderabad: మైనర్లు డ్రైవింగ్‌ చేస్తే.. వాహన యజమానులకు జైలే..

ABN , Publish Date - Jun 23 , 2024 | 10:11 AM

వాహన యజమానులూ తస్మాత్‌ జాగ్రత్త.. కొడుకు మారాం చేస్తున్నాడని, ఇంట్లోకి ఏదైనా అవసరాల నిమిత్తం మైనర్లకు బైక్‌ తాళాలు ఇస్తున్నారా..? అయితే మీకు జైలు శిక్ష తప్పదు. ఇకపై వాహనాలు నడుపుతూ మైనర్లు రోడ్ల మీదకు వస్తే బైక్‌ యజమానులపై కేసులు తప్పవని సిటీ ట్రాఫిక్‌ పోలీసులు(City Traffic Police) హెచ్చరిస్తున్నారు.

Hyderabad: మైనర్లు డ్రైవింగ్‌ చేస్తే.. వాహన యజమానులకు జైలే..

- రూ. 5వేలు జరిమానా.. 3 నెలల కారాగారం

హైదరాబాద్‌ సిటీ: వాహన యజమానులూ తస్మాత్‌ జాగ్రత్త.. కొడుకు మారాం చేస్తున్నాడని, ఇంట్లోకి ఏదైనా అవసరాల నిమిత్తం మైనర్లకు బైక్‌ తాళాలు ఇస్తున్నారా..? అయితే మీకు జైలు శిక్ష తప్పదు. ఇకపై వాహనాలు నడుపుతూ మైనర్లు రోడ్ల మీదకు వస్తే బైక్‌ యజమానులపై కేసులు తప్పవని సిటీ ట్రాఫిక్‌ పోలీసులు(City Traffic Police) హెచ్చరిస్తున్నారు. మైనర్‌లు డ్రైవింగ్‌ చేస్తూ పోలీసులకు చిక్కితే వాహనం ఇచ్చిన తల్లిదండ్రులకు లేదా ఆ వాహన యజమానికి 3నెలల జైలు శిక్షతోపాటు, రూ.5వేల జరిమానా విధించనున్నట్లు సిటీ ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ విశ్వప్రసాద్‌ శనివారం తెలిపారు.


మైనర్‌ డ్రైవింగ్‌, నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనాలు నడపడం, నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌పై సిటీ పోలీసులు శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించినట్లు తెలిపారు. 35 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 85మంది వాహన యజమానులను బాధ్యులను చేసినట్లు తెలిపారు. 40మంది మైనర్‌లను పట్టుకుని, వాహనాలు ఇచ్చిన యజమానులపై కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 23 , 2024 | 10:11 AM