Hyderabad: కాచిగూడ - తిరుపతి స్పెషల్ రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Oct 23 , 2024 | 08:12 AM
దీపావళి పర్వదినం సందర్భంగా కాచిగూడ - తిరుపతి స్పెషల్ రైలు(Kachiguda - Tirupati Special Train)కు ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో ఏ.శ్రీధర్(South Central Railway CPRO A. Sridhar) తెలిపారు. ఈనెల 29, నవంబర్ 5, 12వ తేదీల్లో కాచిగూడ - తిరుపతి (07063) స్పెషల్ రైలును రద్దు చేసినట్టు ఆయన తెలిపారు.
హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా కాచిగూడ - తిరుపతి స్పెషల్ రైలు(Kachiguda - Tirupati Special Train)కు ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో ఏ.శ్రీధర్(South Central Railway CPRO A. Sridhar) తెలిపారు. ఈనెల 29, నవంబర్ 5, 12వ తేదీల్లో కాచిగూడ - తిరుపతి (07063) స్పెషల్ రైలును రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ రైలు కాచిగూడ నుంచి ఆయా తేదీల్లో రాత్రి 10.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.10 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుందని, అయితే ప్రయాణికులకు ఇది సౌకర్యంగా లేకపోవడం వల్ల టికెట్ బుకింగ్ చేసుకోలేదని తెలిపారు. తిరుగు ప్రయాణంలో తిరుపతి - కాచిగూడ (07064) ఈ నెల 30న నవంబర్ 6, 13వ తేదీల్లో ఈ స్పెషల్ రైలు బయలుదేరనుందని, వీటిని కూడా రద్దు చేసినట్టు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Special trains: దీపావళి, ఛత్ పండుగలకు 804 ప్రత్యేక రైళ్లు
.......................................................................
ఈ వార్తను కూడా చదవండి:
......................................................................
Trains cancelled: ‘దానా’ తుఫాన్ ప్రభావంతో 41రైళ్లు రద్దు
- నేటి నుంచి 27వరకు పలుమార్గాల్లో రైళ్ల నిలిపివేత
హైదరాబాద్ సిటీ: ‘దానా’ తుఫాన్ ప్రభావంతో తూర్పుకోస్తా, దక్షిణ మధ్య రైల్వేల పరిధిలోని వివిధ మార్గాల్లో మొత్తం 41 రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఒడిశా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నట్టు సీపీఆర్‌ఓ శ్రీధర్(CPRO Sridhar) తెలిపారు. ప్రధానంగా రద్దయిన రైళ్లలో భువనేశ్వర్, హౌరా, ఖరగ్‌పూర్, పూరీ, తదితర ప్రాంతాల నుంచి బెంగళూరు, రామేశ్వరం, సికింద్రాబాద్, తిరుపతి(Bangalore, Rameswaram, Secunderabad, Tirupati), షాలీమార్, మాల్డా, గౌహతి, కన్యాకుమారి, చెన్నై, గోవా(Kanyakumari, Chennai, Goa) తదితర ప్రాంతాలకు వెళ్ళే రైళ్లు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.
ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!
ఇదికూడా చదవండి: KTR : రేవంత్ చెప్పేవి పచ్చి అబద్ధాలు!
ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్ 1912
ఇదికూడా చదవండి: BRS Leaders : కేటీఆర్, హరీశ్‌రావుకు ప్రాణహని!
Read Latest Telangana News and National News