Share News

Hyderabad: పారిశుధ్య పనుల నిర్వహణ.. మరో 64 కి.మీ. ప్రైవేటుకు

ABN , Publish Date - Nov 29 , 2024 | 01:03 PM

పారిశుధ్య నిర్వహణ ప్రైవేటీకరణకు జీహెచ్‌ఎంసీ(GHMC) అమితాసక్తి చూపుతోంది. ఈసారి టెండర్‌ లేకుండా మరో 64.40 కిలోమీటర్ల పరిధిలోని కారిడార్లను ఏజెన్సీలకు అప్పగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Hyderabad: పారిశుధ్య పనుల నిర్వహణ.. మరో 64 కి.మీ. ప్రైవేటుకు

- అప్పగించేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు

- కారిడార్ల వారీగా ఏజెన్సీల ఎంపిక

- అదే ఫైల్‌లో స్వీపింగ్‌ కాంట్రాక్టు గడువు పొడిగింపు

- అధికారుల తీరుపై అనుమానాలు

హైదరాబాద్‌ సిటీ: పారిశుధ్య నిర్వహణ ప్రైవేటీకరణకు జీహెచ్‌ఎంసీ(GHMC) అమితాసక్తి చూపుతోంది. ఈసారి టెండర్‌ లేకుండా మరో 64.40 కిలోమీటర్ల పరిధిలోని కారిడార్లను ఏజెన్సీలకు అప్పగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే ఏజెన్సీల ఆధీనంలో ఉన్న 60.15 కిలోమీటర్ల (ఖైరతాబాద్‌ జోన్‌) పరిధిలోని స్వీపింగ్‌ కాంట్రాక్టు గడువు కూడా పొడిగించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌ వేగంగా కదులుతోంది. చార్మినార్‌ జోన్‌(Charminar Zone) పరిధిలో మరో 13 కిలోమీటర్ల స్ర్టెచ్‌ల పారిశుధ్య నిర్వహణను ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: TG Govt: దిలావల్‌పూర్ ఇథనాల్ కంపెనీ ఎపిసోడ్.. విచారణలో విస్తుపోయే నిజాలు


పర్యాటకప్రాంతాలు, వీవీఐపీ/వీఐపీలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల పారిశుధ్య నిర్వహణను ప్రైవేట్‌ సంస్థలకు గతంలో అధికారులు అప్పగించారు. ఒప్పంద కాలవ్యవధి ముగియగా పొడిగించిన గడువు నవంబరు 30తో ముగియనుంది. రెన్యూవల్‌ లేదా కొత్త ఏజెన్సీ ఎంపికకు చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యాలయం నుంచి ఖైరతాబాద్‌ జోన్‌కు పంపిన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కాగా.. అదే ఫైల్‌లో నూతన రహదారుల అప్పగింతకు సంబంధించి.. కారిడార్ల వారీగా ఏజెన్సీల పేర్లూ ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటి వరకు సంబంధిత టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించకపోవడం గమనార్హం.


టెండర్లు పిలుస్తాం

కొత్తగా ప్రతిపాదించిన స్ర్టెచ్‌ల పారిశుధ్య నిర్వహణకు ఏజెన్సీల ఎంపిక కోసం టెండర్‌ పిలుస్తామని పారిశుధ్య నిర్వహణ విభాగం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏజెన్సీల పరిధిలోని కారిడార్లకు సంబంధించి రెన్యూవల్‌ చేయాలా..? అన్నింటికి కలిపి బిడ్‌లు ఆహ్వానించాలా..? అన్నది చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు.

city7.2.jpg


ఏటా రూ.47 కోట్ల భారం

పర్యాటక ప్రాంతాలు, గ్రేటర్‌లోని పలు ప్రధాన రహదారుల్లో 24 గంటలూ స్వీపింగ్‌ జరిగేలా మెక్‌లిన్‌, ఇక్సోరా కంపెనీలకు బాధ్యత అప్పగించారు. 73 కిలోమీటర్ల మేర రహదారుల్లో మూడు షిఫ్టులుగా కార్మికులు స్వీపింగ్‌ చేస్తున్నారు. సాధారణంగా రోజుకోమారు రహదారులను ఊడుస్తారు. దేశ, విదేశీ సందర్శకులు రానున్న దృష్ట్యా పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని, వీవీఐపీలు, వీఐపీలు రాకపోకలు సాగించే మార్గాల్లో చెత్తా చెదారం కనిపించవద్దని 24 గంటల స్వీపింగ్‌కు ప్రైవేట్‌ సంస్థల ద్వారా శ్రీకారం చుట్టారు.


city7.jpg

ఇందుకుగాను కిలోమీటర్‌కు సగటున నెలకు రూ.3.12 లక్షలు ఖర్చు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కార్మికులు చేస్తున్న స్వీపింగ్‌కు నెలకు అయ్యే వ్యయం రూ.40 వేలతో పోలిస్తే ఇది ఎనిమిది రెట్లు అధికం. మరో 64 కిలోమీటర్లు ప్రైవేటుకు అప్పగించనున్న నేపథ్యంలో సంస్థపై నెలకు రూ.2 కోట్ల చొప్పున ఏటా రూ.24 కోట్ల ఆర్థిక భారం పడనుంది. గతంలోనే అప్పగించిన రోడ్లకు ప్రస్తుతం ఏటా రూ.22.46 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఈ మొత్తం రూ.47 కోట్లకు పెరగనుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న సంస్థకు ఇది అదనపు భారమే.


ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: తెరచాటు ఒప్పందం..

ఈవార్తను కూడా చదవండి: Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!

ఈవార్తను కూడా చదవండి: Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్‌ ఫ్యాక్టరీ పూర్తి

ఈవార్తను కూడా చదవండి: Komati Reddy: హరీశ్‌, కేటీఆర్‌లది నా స్థాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 29 , 2024 | 01:03 PM