Share News

Hyderabad: RCB Vs SRH మ్యాచ్‌కు వెళ్లే క్రీడాభిమానులకు ముఖ్య గమనిక

ABN , Publish Date - Apr 24 , 2024 | 09:57 AM

ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 25న ఆర్‌సీబీ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌(IPL match)ను పురస్కరించుకుని ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Hyderabad: RCB Vs SRH మ్యాచ్‌కు వెళ్లే క్రీడాభిమానులకు ముఖ్య గమనిక

హైదరాబాద్‌ సిటీ: ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 25న ఆర్‌సీబీ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌(IPL match)ను పురస్కరించుకుని ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 25న రాత్రి 12.15 గంటలకు చివరి రైలు బయలుదేరి చివరి స్టేషన్‌కు 1.10 గంటలకు చేరుకుంటుందన్నారు. మ్యాచ్‌ను వీక్షించిన క్రికెట్‌ అభిమానులు ఉప్పల్‌, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి రైళ్లు ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని వారు సూచించారు.

city4.jpg

ఇదికూడా చదవండి: రేపట్నుంచి వడగాలులు

60 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఐపీఎల్‌ మ్యాచ్‌((IPL match)) సందర్భంగా గ్రేటర్‌లోని పలు ప్రాంతాలనుంచి ఉప్పల్‌ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులు నడుపుతామని గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు స్పెషల్‌ ఆపరేషన్స్‌ నిర్వహిస్తునట్లు తెలిపారు. కంటోన్మెంట్‌, ఇబ్రహీంపట్నం, ముషీరాబాద్‌(Cantonment, Ibrahimpatnam, Mushirabad) డిపో మేనేజర్లు ప్రత్యేక బస్సుల ఆపరేషన్స్‌ చూస్తారని, బస్సుల వివరాలకు కోఠి (9959226160), రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌ (9959226154) కమ్యూనికేషన్‌ సెంటర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

ఇదికూడా చదవండి: Congress: ములుగు జిల్లా: ఉపాధి హామీ కూలీలతో మమేకమైన సీతక్క

Read Latest National News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 10:33 AM