Share News

Hyderabad: మూసీ ప్రక్షాళనకు కాదు.. రియల్‌ వ్యాపారాలకే వ్యతిరేకం

ABN , Publish Date - Nov 16 , 2024 | 09:59 AM

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టే మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న ఆలోచనకే వ్యతిరేకమని ఆపార్టీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు.

Hyderabad: మూసీ ప్రక్షాళనకు కాదు.. రియల్‌ వ్యాపారాలకే వ్యతిరేకం

- నేడు మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ నాయకుల బస

- బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టే మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న ఆలోచనకే వ్యతిరేకమని ఆపార్టీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సామ రంగారెడ్డి మాట్లాడారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సర్వేపై ‘పౌర్ణమి’ ఎఫెక్ట్‌.. 30 శాతానికిపైగా ఎన్యూమరేటర్ల గైర్హాజరు


మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఎప్పుడైనా దరఖాస్తు చేసుకున్నారా? అని ప్రశ్నించగా.. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఎంపీ ఈటల రాజేందర్‌ను మూసీ పరీవాహక ప్రాంతాల్లో బసచేయాలని విసిరిన సవాలును పార్టీ స్వీకరిస్తుందన్నారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం మూసీ పరీవాహక ప్రాం తాల్లో 27చోట్ల బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు బస చేయనున్నారని ఆయన తెలిపారు.


సీఎం రేవంత్‌రెడ్డివి ఊకదంపుడు ఉపన్యాసాలని విమర్శించారు. పేదల ఇళ్లు కూలగొట్టి పెద్ద షాపింగ్‌లు కట్టడమే రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన అన్నారు. గతం లో మోదీ సబర్మతి నది ప్రక్షాళన కోసం దాదాపు 25వందల కిలోమీటర్లు 12నెలల్లో పూర్తి చేశారని గుర్తుచేశారు. 55 కిలోమీటర్ల మూసీకి ఇంతవరకు డీపీఆర్‌ ఖరారు చేయకుండానే ముందుగానే లక్షా యాభైవేల కోట్ల తో పునరుద్ధరిస్తామనడం అవివేకానికి నిదర్శనం అన్నారు. ఎంపీ ఈటల శనివారం సాయంత్రం 4గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు ఫణిగిరి కాలనీలోని మూసీ పరీవాహక ప్రాంతాల కాలనీవాసులతో బస చేస్తారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొత్త రవీందర్‌గౌడ్‌, సునీతారెడ్డి, ఆలే పురంధర్‌ పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌ ఓ రాబందు..

ఈవార్తను కూడా చదవండి: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు

ఈవార్తను కూడా చదవండి: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు

ఈవార్తను కూడా చదవండి: Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 16 , 2024 | 09:59 AM