Share News

Hyderabad: కునుకు లేకుండా పహారా..

ABN , Publish Date - May 15 , 2024 | 10:40 AM

పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌(Parliament Election Schedule) విడుదలైనప్పటి నుంచి పోలీస్‌ సిబ్బంది విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు.

Hyderabad: కునుకు లేకుండా పహారా..

- శక్తివంచన లేకుండా పనిచేసిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌(Parliament Election Schedule) విడుదలైనప్పటి నుంచి పోలీస్‌ సిబ్బంది విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్‌ ఎన్నికలను సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు శక్తివంచన లేకుండా పనిచేసినట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ఒకవైపు బందోబస్తులు, మరోవైపు ఏసీపీ నుంచి సీపీల వరకు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలతో సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఇదికూడా చదవండి: Telangana : మండుతున్న పచ్చిమిర్చి ధరలు.. కిలో రూ.120

city1.jpg

మూడు షిఫ్టులు..

క్షేత్రస్థాయిలో ఎస్‌ఐ స్థాయి నుంచి సీపీ వరకు సిబ్బంది మొత్తం మూడు షిఫ్టుల్లో 24/7 పనిచేశారు. కొన్నిరోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా, కంటి నిండా నిద్రలేకుండా విధులు నిర్వహించారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ట్రై కమిషనరేట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో.. ఎన్నికల సంఘం అధికారులు గుర్తించిన సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు ఉన్న ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించి ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. ముఖ్యంగా హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించి ప్రజలు స్వచ్చందంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదికూడా చదవండి: ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 15 , 2024 | 10:40 AM