Home » Chevella
కార్లు డోర్లు లాకై ఇద్దరు చిన్నారులు ఊపిరాడక.. ప్రాణాలొదిలారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దామరిగిద్ద గ్రామంలో జరిగిందీ విషాదం. పిల్లలిద్దరూ తమ మేనమామ పెళ్లి కోసం తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మ ఇంటికొచ్చి మృత్యువాతపడ్డారు.
గత ప్రభుత్వం పలు నియోజకవర్గాల్లో గడిచిన పదేళ్లలో 43 బ్రిడ్జిల నిర్మాణాలు మొదలు పెట్టినా.. వాటిని పూర్తి చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటికి అప్రోచ్ రోడ్లు సహా మరికొన్ని ఇతర పనులనూ చేయకపోవడంతో అవీ వినియోగానికి అనువుగా లేవు.
చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ డాక్టర్ దాసరి వెంకటరమణకు అరుదైన గౌరవం దక్కింది. 2014లో ఆయన రాసిన ఆనందం అనే కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టికి ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతం తెరమీదికి వచ్చింది.
అది హైదరాబాద్-బీజాపూర్ రహదారి.. ఆ హైవేలో రంగారెడ్డి జిల్లా ఆలూరు వద్ద రైతులు తాము పండించిన కూరగాయలను రోజూలాగానే రోడ్డు పక్కన పెట్టి అమ్ముకుంటున్నారు..
స్వాతంత్య్రం సిద్ధించిననాటి నుంచి మైనారిటీలను వాడుకున్నదని కాంగ్రెస్ పార్టీ అని వారిని ఆదుకున్నది మాత్రం నరేంద్రమోదీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.
జీవో 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులు ఆందోళనపడవద్దని, దసరా లోపు వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
మహేశ్వరం నియోజకర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించిందని, భవిష్యత్‌లో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.
నగరంలో కాలుష్య కోరలు.. చెవులు బద్ధలయ్యే ట్రాఫిక్ చప్పుళ్ల నుంచి దూరంగా పచ్చని ప్రకృతి మధ్య ఇల్లు ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చనే ఆశతో కోట్లు వెచ్చించి విల్లాలు కొన్న వారికి ఇప్పుడా ప్రశాంతతే కరువువైంది!
ఆధార్ ఆన్లైన్ నెట్‌వర్క్‌లో లోపాలతో.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో భూములు/స్థిరాస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి.