Hyderabad Police: రూ. 8.5 కోట్ల విలువైన.. డ్రగ్స్ సీజ్
ABN , Publish Date - Aug 27 , 2024 | 03:59 AM
ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఓ ముఠాను హెచ్-న్యూ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇప్పటికే జైలులో ఉండగా.. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను సీజ్ చేశారు.
సంగారెడ్డి ఫ్యాక్టరీలో తయారీ!
ముగ్గురిని అరెస్టు చేసిన హెచ్-న్యూ
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఓ ముఠాను హెచ్-న్యూ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇప్పటికే జైలులో ఉండగా.. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన డ్రగ్ పెడ్లర్ కుంచాల నాగరాజు.. అతని అనుచరులు ఆశగాని వినోద్ కుమార్ గౌడ్, కుంతి శ్రీశైలం హైదరాబాద్‌లో ఆమ్‌ఫెటమైన్ విక్రయానికి సిద్ధమైనట్లు హెచ్-న్యూ బృందాలకు ఉప్పందింది.
దీంతో వారు బోయిన్‌పల్లి పోలీసులతో కలిసి.. బోయిన్‌పల్లి వద్ద కాపుకాచి, నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 8.5 కిలోల ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. తదుపరి దర్యాప్తులో.. గోసుకొండ అంజిరెడ్డి అనే వ్యక్తి వద్ద ముగ్గురు నిందితులు ఈ డ్రగ్స్‌ను తీసుకున్నట్లు చెప్పారు. అంజిరెడ్డి రెండు నెలల క్రితం టీజీ-న్యాబ్, సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేయడంతో జైలులో ఉన్నాడు. కుంచాల నాగరాజు నగరంలోని బతుకుదెరువు కోసం షాపూర్‌నగర్‌కు వచ్చి, తాపీమేస్త్రీగా పనిచేసేవాడని సీపీ వివరించారు. ఈ క్రమంలో అంజిరెడ్డితో పరిచయం ఏర్పడిందని, ఆయన ద్వారా తాపీ కాంట్రాక్టులు వచ్చేవని చెప్పారు.
ఆ తర్వాత గుమ్మడిదలకు మకాం మార్చిన నాగరాజు.. అంజిరెడ్డి తన ఫ్యాక్టరీల్లో తయారు చేసే అల్ర్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని కల్లు దుకాణాలకు సరఫరా చేసేవాడు. మత్తు పదార్థాల సరఫరాలో ఎక్కువ లాభం వస్తుండడంతో.. పూర్తిస్థాయిలో పెడ్లర్‌గా మారాడు. అంజిరెడ్డి ఈ ఏడాది జూన్‌లో మూడు ప్యాకెట్లలో ఉన్న ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను దాచిపెట్టాలని పేర్కొంటూ నాగరాజుకు ఇచ్చాడు. ఆ తర్వాత అంజిరెడ్డి అరెస్టయి.. జైలులో ఉన్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో నాగరాజు ఆమ్‌ఫెటమైన్‌ను అమ్మడానికి ప్లాన్ చేశాడు. తన అనుచరులు వినోద్‌కుమార్, శ్రీశైలంతో కలిసి.. 8.5 కిలోల ఆమ్‌ఫెటమైన్‌ను విక్రయించేందుకు నగరానికి వచ్చి, పోలీసులకు చిక్కాడు. జైలులో ఉన్న అంజిరెడ్డిని పీటీ వారెంట్‌పై కస్టడీకి తీసుకుని, విచారిస్తే.. మరిన్ని వివరాలు తెలుస్తాయని సీపీ వెల్లడించారు.