Share News

Hyderabad: సర్వేపై ‘పౌర్ణమి’ ఎఫెక్ట్‌.. 30 శాతానికిపైగా ఎన్యూమరేటర్ల గైర్హాజరు

ABN , Publish Date - Nov 16 , 2024 | 09:30 AM

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కార్తీక పౌర్ణమి ప్రభావం పడింది. పండుగ నేపథ్యంలో దాదాపు 30 శాతం మంది ఎన్యూమరేటర్లు(Enumerators) శుక్రవారం విధులకు రాలేదని జీహెచ్‌ఎంసీ(GHMC) వర్గాలు పేర్కొన్నాయి. మహా నగరంలో సర్వే ప్రారంభించినప్పటి నుంచి ప్రతిరోజు 1.30 లక్షల నుంచి 1.45 లక్షల కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తున్నారు.

Hyderabad: సర్వేపై ‘పౌర్ణమి’ ఎఫెక్ట్‌.. 30 శాతానికిపైగా ఎన్యూమరేటర్ల గైర్హాజరు

హైదరాబాద్‌ సిటీ: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కార్తీక పౌర్ణమి ప్రభావం పడింది. పండుగ నేపథ్యంలో దాదాపు 30 శాతం మంది ఎన్యూమరేటర్లు(Enumerators) శుక్రవారం విధులకు రాలేదని జీహెచ్‌ఎంసీ(GHMC) వర్గాలు పేర్కొన్నాయి. మహా నగరంలో సర్వే ప్రారంభించినప్పటి నుంచి ప్రతిరోజు 1.30 లక్షల నుంచి 1.45 లక్షల కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తున్నారు. అయితే పౌర్ణమి ప్రత్యేక పూజల కారణంగా శుక్రవారం లక్షకు పైగా ఇళ్ల నుంచి సమాచారం తీసుకున్నారు. వాస్తవంగా గురునానక్‌(Guru Nanak) జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవుదినం. అయితే ఎన్యూమరేటర్లలో మెజార్టీశాతం మహిళలు ఉన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలు


అలాగే ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వివరాలు సేకరిస్తున్నారు. కాగా, కార్తీకమాసంలో పౌర్ణమి రోజున చాలామంది ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించినప్పటికీ.. విధులకు హాజరుకాని పరిస్థితి నెలకొంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సర్వేకు విరామం ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరినా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేకపోవడంతో విధులకు వచ్చిన ఎన్యూమరేటర్లతో సర్వే నిర్వహించారు. ఆదివారం కూడా సర్వే కొనసాగుతుందని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.


సర్వే పత్రాలు భద్రంగా..

ఎన్యూమరేటర్లు చేస్తున్న సర్వే పత్రాలను ఏ రోజుకారోజు సర్కిల్‌ కార్యాలయంలో అందజేసిన తర్వాత ట్రంక్‌ బాక్సుల్లో భద్రపరుస్తున్నారు. సర్వే చేసిన ఫారాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు ఆదేశిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా ఇప్పటివరకు 27.74 శాతం సర్వే పూర్తి చేసినట్లు అధికారులు చెప్పారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: రేవంత్‌ ఓ రాబందు..

ఈవార్తను కూడా చదవండి: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు

ఈవార్తను కూడా చదవండి: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు

ఈవార్తను కూడా చదవండి: Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 16 , 2024 | 09:30 AM