Share News

Hyderabad: బందోబస్తు వ్యూహాత్మకంగా ఉండాలి..

ABN , Publish Date - Sep 12 , 2024 | 10:21 AM

గణపతి నిమజ్జనం జరిగే ప్రాంతాలు, శోభాయాత్ర జరిగే మార్గంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) అధికారులను ఆదేశించారు. అదనపు, జోనల్‌ కమిషనర్లతో ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Hyderabad: బందోబస్తు వ్యూహాత్మకంగా ఉండాలి..

- గణేష్‌, మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలపై సీపీ సమీక్ష

హైదరాబాద్‌ సిటీ: గణేష్‌, మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(City Police Commissioner CV Anand) సిబ్బందిని ఆదేశించారు. సౌత్‌వెస్ట్ జోన్‌ పోలీస్‌ అధికారులతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సౌత్‌ జోన్‌, సౌత్‌ వెస్ట్‌ జోన్‌లు సిటీలో చాలా కీలకమైనవని, బందోబస్తు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు.

city2.jpg

ఇదికూడా చదవండి: MLA Kaushik Reddy: కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం..


...................................................................

ఈ వార్తను కూడా చదవండి:

..................................................................

Amrapali Kata: భక్తులకు ఇబ్బంది కలగొద్దు..!

- శోభాయాత్ర మార్గంలో అదనపు వీధిదీపాలు

- నేడు స్టాండింగ్‌ కమిటీలో చర్చ

హైదరాబాద్: గణపతి నిమజ్జనం జరిగే ప్రాంతాలు, శోభాయాత్ర జరిగే మార్గంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) అధికారులను ఆదేశించారు. అదనపు, జోనల్‌ కమిషనర్లతో ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మండపాలు, శోభాయాత్ర సాగే రహదారులపై చెత్త వెంటనే తొలగించేలా పారిశుధ్య కార్మికులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. శోభాయాత్ర(Shobhayatra) జరిగే మార్గాల్లో 15,500 అదనపు వీధిదీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు రూ.2.98 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. నేడు జరిగే స్టాండింగ్‌ కమిటీ ఎజెండాలో ఈ ప్రతిపాదనపై చర్చించనున్నారు.

city1.jpg


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 12 , 2024 | 10:21 AM