Share News

Hyderabad: మురుగు శుద్ధి.. ఇక శరవేగంగా...

ABN , Publish Date - Aug 04 , 2024 | 09:41 AM

మహానగరానికి తాగునీటినందించే జంట జలాశయాలు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌(గండిపేట)లోకి చుక్క మురుగునీరు చేరకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈ జలాశయాల ఎగువన పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుండడంతో భారీగా మురుగు వచ్చి చేరుతోంది.

Hyderabad: మురుగు శుద్ధి.. ఇక శరవేగంగా...

- జంట జలాశయాల ఎగువన 4 ఎస్టీపీలు

- రూ.65 కోట్ల వ్యయంతో 9 నెలల్లో నిర్మాణం

- వాటర్‌బోర్డు ప్రతిపాదనకు సర్కారు ఓకే

- త్వరలో టెండర్‌.. ఆ వెంటనే పనులు

హైదరాబాద్‌ సిటీ: మహానగరానికి తాగునీటినందించే జంట జలాశయాలు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌(గండిపేట)లోకి చుక్క మురుగునీరు చేరకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈ జలాశయాల ఎగువన పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుండడంతో భారీగా మురుగు వచ్చి చేరుతోంది. మరో హుస్సేన్‌సాగర్‌(Hussainsagar)గా మారకముందే మురుగును వేగంగా శుద్ధి చేసి వదిలేందుకు వాటర్‌బోర్డు చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జంట జలాశయాల ఎగువ భాగంలో రూ.65 కోట్లతో నాలుగు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాలనాపరమైన అనుమతులు కూడా రావడంతో త్వరలో పనులు ప్రారంభించేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది. నెలరోజుల్లో టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి శంకుస్థాపన చేసేందుకు అడుగులేస్తోంది.

ఇదికూడా చదవండి: Hyderabad: పబ్‌లు, కార్పొరేట్‌ కళాశాలలు, ఐటీ కంపెనీల్లో.. డ్రగ్స్‌ టెస్ట్‌లు


భారీగా నిర్మాణాలు, ఫామ్‌హౌస్‏లు..

జంట జలాశయాల ఎగువ ప్రాంతాల్లో పెద్దఎత్తున ఫామ్‌హౌస్‏లు వెలిశాయి. పలు రిక్రియేషన్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. దీంతోపాటు ఆయా గ్రామాల నుంచి మురుగునీరంతా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌(Osmansagar, Himayatsagar)లలో చేరుతోంది. దీన్ని అరికట్టకపోతే మున్ముందు జలాశయాల ఉనికికే ప్రమాదం ఉన్నందున ఎస్టీపీల నిర్మాణం చేపట్టాలని జలమండలి నిర్ణయించింది. నగరంలోని మణికొండ, సన్‌సిటీ, పాతబస్తీ(Manikonda, Suncity, Old Town)లోని పలు ప్రాంతాలకు ప్రతినిత్యం ఉస్మాన్‌సాగర్‌ నుంచి 97 మిలియన్‌ లీటర్లు, హిమాయత్‌సాగర్‌ నుంచి 36 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు.


9 నెలల్లో నిర్మాణానికి నిర్ణయం

20 ఎంఎల్‌డీల సామర్థ్యం గల ఈ నాలుగు ఎస్టీపీల నిర్మాణానికి రూ.65 కోట్ల మేర వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ పనులను దక్కించుకునే సంస్థ వాటర్‌బోర్డుతో ఒప్పందం చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉస్మాన్‌సాగర్‌ ఎగువన జన్వాడ, హిమాయత్‌నగర్‌ ప్రాంతాల్లో, హిమాయత్‌సాగర్‌ ఎగువన నాగిరెడ్డిగూడ(Nagireddyguda), కాముని నాలా సంగమం వద్ద అవసరమైన భూమిని సేకరించినట్లు తెలిసింది. ఎస్టీపీలు నిర్మించే సంస్థయే రెండేళ్లపాటు పూర్తి నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉంటుందని టెండర్‌ నిబంధనల్లో పొందుపరిచారు.

city2.jpg


నాలుగు ఎస్టీపీల నిర్మాణాలకు చర్యలు

ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ ఎగువన నాలుగు ఎస్టీపీలను నిర్మించనున్నారు. ఉస్మాన్‌సాగర్‌ ఎగువన 9 ఎంఎల్‌డీ(మిలియన్‌ లీటర్‌ ఫర్‌ డే) సామర్థ్యంతో రెండు ఎస్టీపీల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 4 ఎంఎల్‌డీల సామర్థ్యంలో జన్వాడ వద్ద బుల్కాపూర్‌ నాలా సమీపంలో ఒకటి, చిలుకూరు జోన్‌ పరిధిలోని హిమాయత్‌నగర్‌ వద్ద 5 ఎంఎల్‌డీల సామర్థ్యంతో మరొకటి నిర్మించనున్నారు. అలాగే హిమాయత్‌సాగర్‌ ఎగువన 11 ఎంఎల్‌డీల సామర్థ్యంతో రెండు ఎస్టీపీలను నిర్మించనున్నారు. అజీజ్‌నగర్‌, బంగళ్‌గూడ, నాగిరెడ్డిగూడ జోన్‌ పరిధిలో నుంచి వచ్చే మురుగును శుద్ధి చేసేలా నాగిరెడ్డిగూడ వద్ద 5ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఎస్టీపీని నిర్మించడానికి నిర్ణయించారు. అదేవిధంగా మరో ఎస్టీపీని కోత్వాల్‌గూడ, శంషాబాద్‌, కవాగూడ జోన్ల పరిధిలో నుంచి వచ్చే మురుగును శుద్ధి చేసేలా కాముని నాలా సంగమం వద్ద 6ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఎస్టీపీని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Updated Date - Aug 04 , 2024 | 09:41 AM