Hyderabad: ఓయూలో అత్యాధునిక హాస్టల్ సిద్ధం..
ABN , Publish Date - Dec 12 , 2024 | 12:31 PM
ఓయూలో అత్యాధునిక సౌకర్యాలతో సుమారు 7 ఎకరాల సువీశాల విస్తీర్ణంలో నిర్మించిన అతిపెద్ద బాలుర హాస్టల్ భవనం(Boys' hostel building) సిద్ధమైంది. ఈ భవనాన్ని ప్రారంభించడానికి ఓయూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
- ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రారంభించేందుకు సన్నాహాలు
- మొత్తం 4 అంతస్తులు.. 166 గదులు
- ఒకేసారి 250 మంది భోజనం చేసేవిధంగా భోజనశాల
- మల్టీపర్పస్ హాళ్లు, జిమ్, రీడింగ్ రూమ్స్...
హైదరాబాద్: ఓయూలో అత్యాధునిక సౌకర్యాలతో సుమారు 7 ఎకరాల సువీశాల విస్తీర్ణంలో నిర్మించిన అతిపెద్ద బాలుర హాస్టల్ భవనం(Boys' hostel building) సిద్ధమైంది. ఈ భవనాన్ని ప్రారంభించడానికి ఓయూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది పిబ్రవరి నెలాఖరున లేదా మార్చి మొదటి వారంలో హాస్టల్ బిల్డింగ్‌ను ప్రారంభించాలనే లక్ష్యంతో ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా చేసేలా చర్యలు చేపట్టారు. సుమారు రూ.39.50 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్థుల ఎత్తుతో, 166 సువిశాలమైన అత్యాధునిక హంగులతో గదులను నిర్మించారు.
ఈ వార్తను కూడా చదవండి: Love failure: ప్రేమ కోసం మతం మార్చుకున్నా.. అయినా.. ఓ యువతి ఆవేదన..
అంతేకాకుండా ఒకేసారి 250 మంది కూర్చోని భోజనం చేసేవిధంగా భోజనశాల ఉంది. విద్యార్థులు సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు మల్టీపర్సస్ హాల్స్, శారీరకంగా దృఢంగా ఉండేందుకు జిమ్, ప్రత్యేకంగా రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరో రూ.10 కోట్ల వ్యయంతో విద్యార్థులకు బెడ్స్, టేబుల్స్, కుర్చీలతోపాటు ఇతర మౌలికవసతులు కల్పంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ హాస్టల్ భవనం అందుబాటులోకి వస్తే సుమారు 660 మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాన్ని కల్పించవచ్చని అధికారులు తెలిపారు.
త్వరలో ప్రారంభిస్తాం
అత్యాధునిక హంగులతో ఓయూలో నిర్మించిన హాస్టల్ భవనాన్ని త్వరలో ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నహాలు చేస్తున్నాం. హాస్టల్ బిల్డింగ్ మొత్తం నిర్మాణ పనులు పూర్తయిన తరువాత ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేస్తాం. ఈ హాస్టల్ భవనానికి మూసీ హాస్టల్ పేరు పెట్టాలనే ఆలోచనలో ఓయూ అధికారులు ఉన్నారని ఒక దినపత్రికలో, సోషల్ మీడియా గ్రూప్‌ల్లో రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఇప్పటివరకు హాస్టల్ బిల్డింగ్‌కు ఎటువంటి పేరు ప్రతిప్రాదన చేయలేదు. హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం మొత్తం పూర్తయిన తరువాత ఓయూ పాలకమండలి సభ్యులతో, ఉన్నతాధికారులతో చర్చించి పేరును ఖరారు చేస్తాం.
- ప్రొ.మొలుగారం కుమార్ - ఓయూ వైస్ చాన్సలర్
ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే
ఈవార్తను కూడా చదవండి: హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనల్లో.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై అనుమానాలు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్: కవిత
ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్ అవార్డు
Read Latest Telangana News and National News