Share News

Hyderabad: ఉప్పల్‌ స్కైవాక్‌ లిఫ్ట్‌లో చిక్కుకున్న విద్యార్థులు

ABN , Publish Date - Aug 07 , 2024 | 12:09 PM

లిఫ్ట్‌ ఎక్కి త్వరగా ఇంటికి వెళ్లాలనుకున్న విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. సెంట్‌మేరీస్‌ డిగ్రీ కళాశాల(Saint Mary's Degree College)లో చదువుతున్న జాన్సన్‌, జ్యోతి, వాసవిలు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉప్పల్‌ రింగ్‌రోడ్డులో బస్సు దిగారు.

Hyderabad: ఉప్పల్‌ స్కైవాక్‌ లిఫ్ట్‌లో చిక్కుకున్న విద్యార్థులు

- 45 నిమిషాలు అందులోనే..

- పనిచేయని కస్టమర్‌ కేర్‌ నంబర్‌

- రక్షించిన ఆగ్నిమాపక శాఖ అధికారులు

హైదరాబాద్: లిఫ్ట్‌ ఎక్కి త్వరగా ఇంటికి వెళ్లాలనుకున్న విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. సెంట్‌మేరీస్‌ డిగ్రీ కళాశాల(Saint Mary's Degree College)లో చదువుతున్న జాన్సన్‌, జ్యోతి, వాసవిలు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉప్పల్‌ రింగ్‌రోడ్డులో బస్సు దిగారు. రోడ్డు దాటేందుకు స్కైవాక్‌(Skywalk) ఎక్కారు. వారు లిఫ్ట్‌ ఎక్కిన కొన్ని సెకన్లలోనే ఆగిపోయింది. లిఫ్ట్‌లోపల ఉన్న టోల్‌ఫ్రీ నం బర్‌కు కాల్‌ చేస్తే అది పని చేయడం లేదు.

ఇదికూడా చదవండి: MLA: చిరువ్యాపారులను ఇబ్బందులకు గురిచేయొద్దు..


ఏం చేయాలో పాలుపోని ఆ విద్యార్థులు ఎట్టకేలకు 100కు డయల్‌ చేశారు. దీంతో సమాచారం అందుకున్న ఉప్పల్‌ భగాయత్‌(Uppal Bhagayat)లోని ఆగ్నిమాపక సిబ్బంది ఉప్పల్‌ రింగ్‌రోడ్డు(Uppal Ring Road)లోని లిఫ్ట్‌ వద్దకు చేరుకున్నారు. ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌(Fire Officer Sridhar) ఆధ్వర్యంలో ఆగ్నిమాపక సిబ్బంది వెంట తెచ్చిన పరికరాలతో లిఫ్ట్‌ను తెరిచి అందులో ఉన్న ముగ్గురు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

city5.2.jpg


అప్పటికే 45 నిమిషాల సమయం పట్టింది. దీంతో ఆ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తాము ఎంతో భయపడ్డామని, కరెంట్‌ ఉండడంతో ఫ్యాన్‌ తిరగడం వల్ల ఆక్సిజన్‌ అందిందని, లేకపోతే మా పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తోందని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ లిఫ్ట్‌ గతంలో రెండుసార్టు ఇలా అగిపోయిందని, తామే వచ్చి అందులో ఇరుక్కున్న వారిని కాపాడామని ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ తెలిపారు.


ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?

దికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!

Updated Date - Aug 07 , 2024 | 12:09 PM