Traffic Restrictions: హైదరాబాదీలకు అలర్ట్.. ఆ రూట్‌లన్నీ బంద్..
ABN , Publish Date - Dec 09 , 2024 | 02:18 PM
Hyderabad TrafficAdvisory: నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలు, సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..
హైదరాబాద్, డిసెంబర్ 09: నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలు, సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేసింది. సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫింక్ ఆంక్షలు ఉంటాయిని ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..
సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దలు, విపక్ష పార్టీల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతలు సహా ప్రముఖులు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ పరిసర ప్రాంతాలు పోలీస్ పహారాతో ఉండనున్నాయి. ప్రముఖ రద్దీ నేపథ్యంలో.. సచివాలయం మార్గంలో వెళ్లే వాహనాలన్నింటినీ రూట్ మళ్లించనున్నారు.
Also Read:
సీఎంకు థ్యాంక్స్ చెప్పిన బొత్స.. ఎందుకో తెలుసా
ఇలా చేస్తే పడుకున్న వెంటనే నిద్ర పోతారు..
రోహిత్ కాళ్లకు పనిచెప్పాల్సిందే..
For More Telangana News and Telugu News..