Share News

Hyderabad: గోల్కొండ బోనాల సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు..

ABN , Publish Date - Jul 07 , 2024 | 11:26 AM

గోల్కొండ బోనాల సందర్భంగా గోల్కొండ(Golconda)కు వెళ్లే దారుల్లో వాహనాలను అనుమతించబోమని, భక్తులు కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్‌ చేసుకోవాలని అడిషనల్‌ సీపీ పి.విశ్వప్రసాద్‌(Additional CP P. Vishwaprasad) తెలిపారు.

Hyderabad: గోల్కొండ బోనాల సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు..

- పార్కింగ్‌కు ఏర్పాట్లు

హైదరాబాద్‌ సిటీ: గోల్కొండ బోనాల సందర్భంగా గోల్కొండ(Golconda)కు వెళ్లే దారుల్లో వాహనాలను అనుమతించబోమని, భక్తులు కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్‌ చేసుకోవాలని అడిషనల్‌ సీపీ పి.విశ్వప్రసాద్‌(Additional CP P. Vishwaprasad) తెలిపారు. బోనాలకు నగరంతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చే అవకాశమున్నందున గోల్కొండకు వచ్చే రోడ్లలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుందన్నారు. గోల్కొండ కోటలో అమ్మవారికి ఈనెల 7న మొదటి పూజ, 11న రెండో పూజ, 14న మూడో పూజ, 18న నాలుగో పూజ, 21న ఐదో పూజ, 25న ఆరో పూజ, 28న ఏడో పూజ, ఆగస్టు 1న ఎనిమిదో పూజ, ఆగస్టు 4న తొమ్మిదో పూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రామ్‌దేవ్‌గూడ నుంచి గోల్కొండకు వెళ్లే మక్కీదర్వాజ, లంగర్‌హౌజ్‌ నుంచి వెళ్లే ఫతేదర్వాజ, షేక్‌పేట నాలా నుంచి వెళ్లే బంజారాదర్వాజ వద్ద భారీగా భక్తులు వచ్చే అవకాశముండటంతో ఆయా ప్రాంతాల్లో వాహనాలను అనుమతించరు.

ఇదికూడా చదవండి: TGSRTC: అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..


రాందేవ్‌గూడ వైపునుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను మిలిటరీ గ్రౌండ్‌, అశూర్‌ఖానాలో నిలుపుకొని గోల్కొండకు వెళ్లాలి. లంగర్‌హౌజ్‌ వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలను ఫతేదర్వాజ వైపు అనుమతించరు. వారు తమ వాహనాలను మిలిటరీ గ్రౌండ్‌లో నిలుపుకోవాలి. షేక్‌పేట వైపు నుంచి వచ్చే భక్తులు గోల్ఫ్‌క్లబ్‌ పార్కింగ్‌లో తమ వాహనాలను నిలిపి గోల్కొండ లోపలికి వెళ్లాలి. ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా తమకు కేటాయించిన ప్రదేశంలోనే భక్తులు వాహనాలు నిలుపుకోవాలని, ట్రాఫిక్‌ సంబంధిత సమస్య ఉంటే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9010203626లో సంప్రదించాలని పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 07 , 2024 | 11:26 AM