Share News

Hyderabad: మిశ్రమ వాతావరణంతో వైరస్‌ ముప్పు..

ABN , Publish Date - Oct 05 , 2024 | 09:36 AM

అప్పటి వరకు వేడిగా ఉన్న వాతావరణం అకస్మాత్తుగా చల్లగా మారిపోతోంది. సాయంత్రానికి వర్షం కురుస్తోంది. వాతావరణంలో అసాధారణ మార్పులను తట్టుకోలేక శరీరం తల్లడిల్లిపోతోంది. దీంతో మనిషి నీరసించిపోతున్నాడు. రోగ నిరోధక శక్తి తగ్గి అనారోగ్యం పాలవుతున్నాడు.

Hyderabad: మిశ్రమ వాతావరణంతో వైరస్‌ ముప్పు..

- ఎండ అంతలోనే వాన

- పౌరుల ఆరోగ్యంపై ప్రభావం

హైదరాబాద్‌ సిటీ: అప్పటి వరకు వేడిగా ఉన్న వాతావరణం అకస్మాత్తుగా చల్లగా మారిపోతోంది. సాయంత్రానికి వర్షం కురుస్తోంది. వాతావరణంలో అసాధారణ మార్పులను తట్టుకోలేక శరీరం తల్లడిల్లిపోతోంది. దీంతో మనిషి నీరసించిపోతున్నాడు. రోగ నిరోధక శక్తి తగ్గి అనారోగ్యం పాలవుతున్నాడు.

దుమ్ము, ధూళి పీల్చుకోవడంతో..

తేమ వాతావరణంలో రాత్రుళ్లు దుమ్ము, దూళి పైకి లేవదు. ఉదయం 10 అయిందంటే చాలు ఎండ వేడిమికి దుమ్ము, ధూళి పైకి లేస్తోంది. వాహనదారుల శ్వాసకోశంలోకి చేరుతోంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, డస్ట్‌ అలర్జీ, గొంతునొప్పి, వాపు, అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డీసీస్‌ (సీవోపీడీ) వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారం పదిరోజులైనా ఇబ్బందులు తగ్గడం లేదు.

ఇదికూడా చదవండి: Nagarjuna: 100 కోట్లకు మరో దావా వేస్తా..


ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ అనుకూలం..

సహజంగా వేసవి వాతావరణంలో వైరస్‌ బలహీనంగా ఉంటుంది. కానీ విభిన్న వాతావరణంతో వైరస్‌ పుంజుకుంటోందని వైద్యులు తెలిపారు. ఫ్లూ, దగ్గు, జలుబు, న్యుమోనియా, బ్రాంకైటిస్‌, ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు బాగా పెరిగాయని వైద్యులు వివరించారు. ఎండ, చలి, తేమ వాతావరణం ఒకేరోజు చోటుచేసుకోవడం వల్ల వైర్‌సకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఇన్‌ఫ్లుయెంజా శక్తివంతమైతే జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయని చెప్పారు.


వ్యాక్సిన్లు వేసుకోవడం ఉత్తమం..

ఈ వాతావరణంలో ఆయాసం, దగ్గు వంటి ఇబ్బందులు మరింత పెరుగుతాయి. పెద్దలు, పిల్లలు ఇంటివద్దే ఉండే ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పడు తాజా ఆహారం తీసుకోవాలి. ఈగలు, దోమలు ముసిరే ప్రాంతాల్ని శుభ్రం చేసుకోవాలి. ముందు జాగ్రత్తగా ఫ్లూ వ్యాక్సిన్లు వేసుకోవడం ఉత్తమం.

- డాక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌, సీనియర్‌ జనరల్‌ ఫిజిషియన్‌,

కిమ్స్‌-సన్‌షైన్‌ ఆస్పత్రి


..........................................................................

ఈ వార్తను కూడా చదవండి:

..........................................................................

MP DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

- తెలంగాణలో మరో నియంత పాలన..

- చార్మినార్‌ వద్ద బతుకమ్మ వేడుకల్లో డీకే అరుణ

హైదరాబాద్: తెలంగాణలో ఓ నియంత ప్రభుత్వం పోయి మరో నియంత ప్రభుత్వం రాజ్యమేలుతోందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ(Mahbubnagar MP DK Aruna) అన్నారు, చార్మినార్‌ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. హైకోర్టు అనుమతి తెచ్చుకొని బతుకమ్మ పండుగ నిర్వహించుకోవాల్సి రావడం బాధాకరమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని, మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వ్యాఖ్యలతో రాష్ట్రంలో మహిళలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.

city1.jpg


ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా మహిళలు కాంగ్రెస్‏కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌, తెలంగాణ మహిళ మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ సీనియర్‌ నాయకుడు ఉమా మహేంద్ర, కునాల్‌రావు, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

city1.2.jpg


ఇదికూడా చదవండి: Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

ఇదికూడా చదవండి: KBR Park: 7 వంతెనలు.. 7 సొరంగ మార్గాలు

ఇదికూడా చదవండి: Harish Rao,: దసరా తర్వాత ఢిల్లీలో ధర్నా

ఇదికూడా చదవండి: నా కుమారుల ఫామ్‌హౌ్‌సలు ఎక్కడున్నాయో చూపించాలి?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 05 , 2024 | 09:36 AM