Share News

Hyderabad: జలమండలి నయా ఆలోచన.. మ్యాన్‌హోల్‌ వ్యర్థాల నుంచి ‘ఇసుక’

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:02 PM

ఇసుకన తైలంబు తీయవచ్చు.. అన్నది పాత సామెత. మ్యాన్‌హోల్‌ వ్యర్థాల నుంచి ఇసుకను తీయవచ్చు.. అన్నది నేటి మాట. మహానగరంలో వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో వేలాది మ్యాన్‌హోళ్ల నుంచి తీసే సివరేజ్‌ వ్యర్థాలను వేరుచేసి పాలిషింగ్‌ చేయడం ద్వారా ఇసుక రానుంది.

Hyderabad: జలమండలి నయా ఆలోచన.. మ్యాన్‌హోల్‌ వ్యర్థాల నుంచి ‘ఇసుక’

- శుభ్రం చేసి వేరు చేసే ప్రణాళిక

- ఆ ఇసుకను బయట అమ్మడమా ?

- సొంత అవసరాలకు వాడుకోవడమా ?

- ప్రణాళిక రచిస్తున్న అధికారులు

- సిల్ట్‌ డంపునకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు యోచన

మ్యాన్‌హోళ్ల(Manholes) నుంచి వచ్చే వ్యర్థాల (సిల్ట్‌) ద్వారా ఇసుకను వేరు చేయాలని జలమండలి భావిస్తోంది. నిత్యం ట్రక్కుల కొద్దీ వచ్చే సిల్ట్‌ను ప్రత్యేక కేంద్రాల్లో డంపు చేసి అక్కడ ఇసుకను తీయాలని ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ఇసుకను కొత్త మ్యాన్‌హోళ్ల నిర్మాణంతోపాటు పాతవాటికి మరమ్మతులు చేయొచ్చని యోచిస్తోంది. దీనివల్ల బోర్డుపై ఆర్థికభారం తగ్గుతుందని అంచనా వేస్తోంది.

హైదరాబాద్‌ సిటీ: ఇసుకన తైలంబు తీయవచ్చు.. అన్నది పాత సామెత. మ్యాన్‌హోల్‌ వ్యర్థాల నుంచి ఇసుకను తీయవచ్చు.. అన్నది నేటి మాట. మహానగరంలో వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో వేలాది మ్యాన్‌హోళ్ల నుంచి తీసే సివరేజ్‌ వ్యర్థాలను వేరుచేసి పాలిషింగ్‌ చేయడం ద్వారా ఇసుక రానుంది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వియ్‌ వాంట్‌ మెట్రో.. నగర ఉత్తర ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌


ఇలా పోగవుతున్న ఇసుకను బహిరంగ మార్కెట్‌లో విక్రయించడమా ? లేదా సొంతవసరాలకు వినియోగించుకోవాలా ? అన్న విషయంలో బోర్డు కసరుత్తు చేస్తోంది. ఇక వివిధ ప్రాంతాల నుంచి సేకరించే వ్యర్థాల(సిల్ట్‌)ను అడ్డగోలుగా పారబోయకుండా చర్యలు చేపట్టనుంది. ఇందుకు నగరవ్యాప్తంగా నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడే సిల్ట్‌ను డంప్‌ చేయాలని యోచిస్తోంది.

city10.2.jpg


నిత్యం భారీ ఎత్తున సిల్ట్‌ సేకరణ

సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల (ఎస్టీపీ) నుంచి వచ్చే వ్యర్థాల ద్వారా ఇప్పటికే సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. అలాగే మ్యాన్‌హోల్‌ నుంచి వచ్చే వ్యర్థాలు (సిల్ట్‌) నుంచి ఇసుకను వేరు చేసి దాన్ని వాటర్‌బోర్డుకు అవసరమైన మ్యాన్‌హోళ్ల మూతలు, ఇటుకలు, పైపులు తదితర తయారీకి వినియోగించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో ఎయిర్‌టెక్‌, మినీ ఎయిర్‌టెక్‌ మిషన్ల నిర్వాహకులు మ్యాన్‌హోళ్లు శుభ్రం చేయగానే.. అందులో నుంచి వచ్చే వ్యర్థాలను తీసుకెళ్లేవారు. గత ప్రభుత్వంలో దళితబంధు పథకంలో భాగంగా 160 సిల్ట్‌ కార్టింగ్‌ వాహనాలను వాటర్‌బోర్డు ప్రవేశపెట్టింది. దాంతో మ్యాన్‌హోళ్లను ఎయిర్‌టెక్‌ మిషన్లు శుభ్రం చేస్తుండగా, అందులో నుంచి వచ్చే వ్యర్థాలను సిల్ట్‌ కార్టింగ్‌ వాహనాలు తీసుకెళ్తున్నాయి. కొత్తలో ఈ వాహనాలు బాగానే పనిచేసినా తర్వాత దారితప్పాయి.


చేరేదంతా ఇసుకనే..

గ్రేటర్‌ పరిధిలో దాదాపు 8లక్షల వరకు మ్యాన్‌హోళ్లు ఉండగా.. అందులో అధికభాగం ఇసుక చేరుతోంది. వర్షాల సమయంలో పెద్దఎత్తున ఇసుకమేట వేస్తోంది. మురుగుతోపాటు ఇళ్లు, అపార్ట్‌మెంట్లను శుభ్రం చేస్తే వచ్చే నీరంతా మ్యాన్‌హోళ్లలోనే కలుస్తోంది. ఎక్కడైనా దెబ్బతిన్నా, వ్యర్థాలు పొగైనా మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లడంతో వీధుల్లోకి ఇసుక చేరుతోంది. ఇటీవల వాటర్‌బోర్డు ప్రారంభించిన ‘ఆపరేషన్‌ సివరేజ్‌’లో ప్రతీ మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయడంతోపాటు సివరేజ్‌ లైన్లను క్లీనింగ్‌ చేస్తుండగా.. ఆయా ప్రాంతాల్లో ట్రక్కుకుపైగా సిల్ట్‌ వస్తుండడం గమనార్హం.


ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం

ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం

ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 13 , 2024 | 12:02 PM