Share News

Hyderabad: దివ్యాంగుల మేనిఫెస్టోను అమలుచేసి తీరుతాం..

ABN , Publish Date - Jul 11 , 2024 | 11:22 AM

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన దివ్యాంగుల మేనిఫెస్టోను అమలుచేసి తీరుతామని రాష్ట్ర దివ్యాంగుల సహకారసంస్థ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య(Muthineni Veeraiah) అన్నారు.

Hyderabad: దివ్యాంగుల మేనిఫెస్టోను అమలుచేసి తీరుతాం..

- రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వీరయ్య

- హాజరైన మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన దివ్యాంగుల మేనిఫెస్టోను అమలుచేసి తీరుతామని రాష్ట్ర దివ్యాంగుల సహకారసంస్థ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య(Muthineni Veeraiah) అన్నారు. మలక్‌పేటలోని దివ్యాంగుల కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తీన్మార్‌ మల్లన్న, బల్మూరి వెంకట్‌ ముఖ్యఅతిథులుగా హాజరై పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్‌ వీరయ్య మాట్లాడుతూ దివ్యాంగులకు త్వరలోనే రూ.6వేలు పింఛన్‌ అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రాచకొండ కమిషనర్‌గా సుధీర్‌బాబు


దివ్యాంగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశానని, కాంగ్రెస్‌ పార్టీ తన సేవలను గుర్తించి పదవి ఇచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘాల నాయకులు, ఉద్యోగులు వీరయ్యను సన్మానించారు. కార్యక్రమంలో జీఎం ప్రభంజన్‌రావు, ఏఓ రాజేందర్‌, కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 11 , 2024 | 11:22 AM