Share News

Hyderabad: ఎంఎంటీఎస్‌ సేవలను మెరుగుపరుస్తాం.. సమయపాలనను నేనే పర్యవేక్షిస్తా

ABN , Publish Date - Oct 18 , 2024 | 10:38 AM

అతితక్కువ చార్జీతో ప్రయాణించే ఎంఎంటీఎస్‌ సర్వీసులను(MMTS services) మెరుగుపర్చి ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తామని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.

Hyderabad: ఎంఎంటీఎస్‌ సేవలను మెరుగుపరుస్తాం.. సమయపాలనను నేనే పర్యవేక్షిస్తా

- దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏకే జైన్‌

హైదరాబాద్‌ సిటీ: అతితక్కువ చార్జీతో ప్రయాణించే ఎంఎంటీఎస్‌ సర్వీసులను(MMTS services) మెరుగుపర్చి ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తామని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్‌ సర్వీసుల్లో కోత, సమయపాలన లేని సర్వీసులతో ప్రయాణికుల అసంతృప్తిపై ‘నాడు 175.. నేడు 70’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. జంటనగరాల్లోని ప్రయాణికుల సంఘాలతో బుధ, గురువారాల్లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డీఆర్‌ఎంలు వేర్వేరుగా సమావేశమయ్యారు. గతంలో ఉన్న సర్వీసులను పెంచాల్సింది పోయి, భారీగా కోత విధించడంపై సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇక.. నాలాలూ ప్రైవేటుకే..!


గతంలో మాదిరి సేవల పునరుద్ధరణ

జంటనగరాల్లో తిరిగే ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయపాలనను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని దక్షిణ మధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ ప్రకటించారు. ఇకపై ఎలాంటి ఆలస్యం జరగకుండా చూస్తానని, గతంలో మాదిరి సేవలను పునరుద్ధరిస్తామని హామీఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డీఆర్‌ఎంలకు ఆదేశాలిచ్చారు.


.................................................................

ఈ వార్తను కూడా చదవండి:

....................................................................

Hyderabad: వామ్మో.. రూ. 8.65 లక్షలు అప్పనంగా కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

- ట్రేడింగ్‌ టిప్స్‌ ఇస్తామంటూ మోసం

- 22 ఏళ్ల యువకుడి నుంచి రూ. 8.65 లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: ట్రేడింగ్‌ టిప్స్‌ ఇస్తామంటూ సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) యువకుడి నుంచి రూ. 8.65 లక్షలు కొల్లగొట్టారు.. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన 22 ఏళ్ల యువకుడు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం వాట్సా్‌ప్(Whatsapp)‏లో ఒక మెసేజ్‌ వచ్చిం ది. ట్రేడింగ్‌లో టిప్స్‌ ఇస్తామని, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చేలా చూస్తామని రాసి ఉంది. దాంతో ట్రేడింగ్‌లో అనుభవం ఉన్న యువకుడు ఆ మెసేజ్‌కు స్పందించాడు. అనంతరం అవతలి వ్యక్తులు ఇచ్చిన సలహాలు, సూచనలు తీసుకొని ప్రారంభంలో మంచి లాభాలు సంపాదించాడు.

city6.jpg


తాము చెప్పిన విధంగా వేరే సంస్థలో పెట్టుబడులు పెట్టాలని, ఊహించని లాభాలు వస్తాయని చెప్పడంతో.. అవతలి వ్యక్తుల మాటలు నమ్మిన యువకుడు వారు చెప్పిన ఖాతాలో రూ. 8.65లక్షలు వేశాడు. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు నమ్మించిన కేటుగాళ్లు ఆ డబ్బులు చేతికి అందగానే కాంటాక్టు కట్‌ చేసి ఉడాయించారు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: BJP: కిషన్‌రెడ్డిపై అనుచిత వీడియోలు తొలగించాలి

ఇదికూడా చదవండి: Vijay Babu: కేసీఆర్‌ వల్లే చిన్న లిఫ్టులు నిర్వీర్యం

ఇదికూడా చదవండి: బీఆర్‌ఎస్‌ హయంలో నాసిరకం చీరలు ఇచ్చి.. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చారు

ఇదికూడా చదవండి: బతుకమ్మ చీరల విషయంలో సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు: హరీశ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 18 , 2024 | 10:38 AM