Share News

Hyderabad: వాట్‌ ఈజ్‌ హ్యాపెనింగ్‌.. పారిశుధ్యం అధ్వానంగా ఉంది..

ABN , Publish Date - Aug 31 , 2024 | 08:40 AM

‘వాట్‌ ఈజ్‌ హ్యాపెనింగ్‌. పారిశుధ్యం అధ్వానంగా ఉంది. ఇంత అశ్రద్ధ ఉంటే ఎలా’ అంటూ జీహెచ్‌ఎంసీ అధికారులపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్‌(M. Danakishore) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad: వాట్‌ ఈజ్‌ హ్యాపెనింగ్‌.. పారిశుధ్యం అధ్వానంగా ఉంది..

- అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు

- రోడ్ల పక్కన చెత్త ఉండటంతో అధికారులపై దానకిషోర్‌ ఆగ్రహం

హైదరాబాద్‌ సిటీ: ‘వాట్‌ ఈజ్‌ హ్యాపెనింగ్‌. పారిశుధ్యం అధ్వానంగా ఉంది. ఇంత అశ్రద్ధ ఉంటే ఎలా’ అంటూ జీహెచ్‌ఎంసీ అధికారులపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్‌(M. Danakishore) ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.1.25 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులతో బాలాగార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ నుంచి గుర్రం చెరువు వరకూ 800 మీటర్లమేర నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణపనులను శుక్రవారం దానకిషోర్‌ పరిశీలించారు. ఆ పరిసరాల్లో రోడ్డుకు ఇరువైపులా చెత్తాచెదారం, వ్యర్థాలుండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులపై దానకిశోర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేరోడ్డులో బాలాపూర్‌ గణేష్‌ నిమజ్జన ఊరేగింపు జరుగుతుందని, పారిశుధ్యం, పరిశుభ్రతపై అలక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా.. ముఖంమీద యాసిడ్‌ పోసి దారి దోపిడీ..


city1..2.jpg

రెండురోజుల్లో బాలాపూర్‌ ఎక్స్‌రోడ్‌(Balapur X road) నుంచి డీఆర్‌డీఓ వెళ్లే రోడ్డు మార్గంతో పాటు బాలాపూర్‌ గణేష్‌ నిమజ్జన ఊరేగింపు మార్గంలో పారిశుధ్యం, పరిశుభ్రత నెలకొనేలా చూడాలన్నారు. ఈ మార్గంలో పెండింగ్‌ సీసీ, బీటీ రోడ్డు నిర్మాణపనులను మిషన్‌ మోడ్‌లో చేపట్టి పూర్తి చేయాలని, శాశ్వత వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జన ఊరేగింపు సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లను సంబంధిత మున్సిపల్‌ అధికారులతో కలిసి పరిశీలించాలని డీసీపీ సునీతకు సూచించారు. త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ వాణి, ఉప కార్యనిర్వహణ ఇంజనీర్‌ వెంకన్నలకు సూచించారు. అనంతరం గుర్రం చెరువు రోడ్డు మార్గాన్ని పరిశీలించారు.


.......................................................

ఈ వార్తను కూడా చదవండి:

........................................................

Collector: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం 32 ఎకరాల్లో..

- ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా రోడ్డు కనెక్టివిటీ

- కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

city2.jpg

హైదరాబాద్‌ సిటీ: ఉస్మానియా నూతన ఆస్పత్రి భవన నిర్మాణాన్ని దాదాపు 32 ఎకరాల్లో చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Collector Anudeep Durishetti) తెలిపారు. నగరం నడిబొడ్డున నిర్మించనున్న భవనాన్ని కార్పొరేట్‌కు దీటుగా చేపట్టి తెలంగాణకు రోల్‌ మోడల్‌గా ఉంచుతామన్నారు. గోషామహల్‌ పోలీస్ స్టేడియంను కలెక్టర్‌ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భవనాలు, పరిసర ప్రాంతాలు, రోడ్లు, నాలాను బైక్‌పై వెళ్లి పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశాల మేరకు ఉస్మానియా నూతన భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశామన్నారు.


city2.2.jpg

ఆస్పత్రిని మరో వందేళ్లకు అవసరమయ్యే విధంగా నిర్మిస్తామన్నారు. గోషామహల్‌ పోలీస్‌ అకాడమీ(Goshamahal Police Academy), అనుబంధ శాఖలను బహదూర్‌పురా పేట్లబురుజులోని పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ కేంద్రంలోకి మార్చుతామన్నారు. హైదరాబాద్‌ నగరవాసులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు ఉండకుండా ఆస్పత్రికి చేరుకునేలా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీఓ జ్యోతి, ఏసీపీ ఉదయ్‌కృష్ణ, మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ శశిరేఖ, తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ సయ్యద్‌ సైదుద్దీన్‌, సర్వేయర్లు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 31 , 2024 | 08:40 AM