Hyderabad: చెత్త వేస్తే.. రూ. 1000 ఫైన్ కట్టాల్సిందే..
ABN , Publish Date - Oct 09 , 2024 | 10:36 AM
మీరు రోడ్డుపై వెళుతూ ఆగే ప్రయత్నం చేశారనుకోండి.. పై నుంచి ఆకాశవాణి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. సమీపంలో బిగించి ఉన్న సీసీ కెమెరా(CC camera) మిమ్మల్ని గమనించి రోడ్డుపై ఆగి చెత్త వేస్తున్నారేమో అని భ్రమించి సీసీ కెమెరాలకు అనుసంధానంగా ఉన్న మైక్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
- రోడ్లపై చెత్త నిర్మూలనకు జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రయోగం
- ఉప్పల్ సర్కిల్ డీసీ ఆంజనేయులు ప్లాన్ సక్సెస్
- పరిశుభ్రంగా మారిన రోడ్డు కూడళ్లు
హైదరాబాద్: మీరు రోడ్డుపై వెళుతూ ఆగే ప్రయత్నం చేశారనుకోండి.. పై నుంచి ఆకాశవాణి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. సమీపంలో బిగించి ఉన్న సీసీ కెమెరా(CC camera) మిమ్మల్ని గమనించి రోడ్డుపై ఆగి చెత్త వేస్తున్నారేమో అని భ్రమించి సీసీ కెమెరాలకు అనుసంధానంగా ఉన్న మైక్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. దీంతో దారి వెంట వెళుతున్న వాళ్లు రోడ్డుపై ఒక వేల చెత్త వేసేందుకు ప్రయత్నిస్తే మిమ్మల్ని హెచ్చరించడమే కాకుండా మీరు చెత్త వేస్తున్న దృశ్యాలను చిత్రీకరించి నేరుగా జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్ కార్యాలయానికి, సంబంధిత అధికారికి పంపిస్తుంది. చిత్రాలన్నింటినీ భద్రపరుస్తుంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బ్లాక్ మ్యాజిక్ పేరుతో మోసం చేస్తున్న బాబా అరెస్టు..
అధికారులు అక్కడ చెత్త వేసిన వారిని గుర్తించి రూ.1000 జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఈ వినూత్న ప్రయోగానికి ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు ఇటీవలే శ్రీకారం చుట్టారు. కొన్ని నెలల క్రితం ఉప్పల్ సర్కిల్ డీసీ(Uppal Circle DC)గా బాధ్యతలు చేపట్టిన డీసీ ఆంజనేయులు రోడ్లపై మూల మలుపుల వద్ద, నిర్మాణుష్య ప్రాంతాల వద్ద ఉదయం రాత్రి వేళల్లో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు రోడ్డుపై చెత్త వేసి వెళుతున్నారు. దీంతో వారిని గుర్తించడం జీహెచ్‌ఎంసీ అధికారులకు కష్టసాధ్యం గా మారింది. ఇలాంటి చర్యలను నిర్మూలించేందుకు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే దురలవాటుకు స్వస్తి పలికేందుకు జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కి ల్ అధికారులు సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
సీసీ కెమెరాల ప్రయోగం సక్సెస్
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే అలవాటుకు స్వస్థి పలకడంలో సీసీ కెమెరాల ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఉప్పల్ సర్కిల్‌లో రోడ్లపైనే చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి 23 ప్రాంతాల్లో స్థానిక కాలనీవాసుల సహకారంతోనే ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు గుర్తించి మైక్ సహాయంతో హెచ్చరించడం, జరిమానా విధిస్తామని చెబుతుండడంతో భయపడి చెత్తవేయడంలేదు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాలనీ వాసులు ముందుకు వస్తే మరిన్ని ఇలాంటి కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఉప్పల్ సర్కిల్ డీసీ ఆంజనేయులు చెబుతున్నారు.
ఇదికూడా చదవండి: Harish Rao: ఫీజుల చెల్లింపుల్లో సర్కారు నిర్లక్ష్యం
ఇదికూడా చదవండి: Mulugu: కాటేసిన పాము, కరెంటు!
ఇదికూడా చదవండి: విద్యుత్తు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్
ఇదికూడా చదవండి: Investment Scam: స్టాక్ బ్రోకింగ్ పేరుతో.. ఘరానా మోసం!
Read Latest Telangana News and National News