Share News

ACB: శివబాల కృష్ణ ఇంట్లో సోదాలు ముగిశాయి: ఏసీబీ జాయింట్ డైరెక్టర్

ABN , Publish Date - Jan 25 , 2024 | 08:30 AM

హైదరాబాద్: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌.. ప్రస్తుత రెరా సెక్రటరీ శివబాలకృష్ణ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు.

ACB: శివబాల కృష్ణ ఇంట్లో సోదాలు ముగిశాయి: ఏసీబీ జాయింట్ డైరెక్టర్

హైదరాబాద్: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌.. ప్రస్తుత రెరా సెక్రటరీ శివబాలకృష్ణ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శివబాల కృష్ణ గతంలో హెచ్‌ఏమ్‌డిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ అని, ప్రస్తుతం మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్, రెరా సెక్రటరీగా పని చేస్తున్నారని, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆయన సమీప బంధువులు, స్నేహితులు, కొలీగ్స్ నివాసాలు, 17 ప్రదేశాల్లో సోదాలు జరిగాయన్నారు. శివబాల కృష్ణ ఇంట్లో రూ. 84 లక్షల 60 వేల నగదు, 2 కేజీల బంగారం, 5.5 కేజీల వెండి, రూ. 32 లక్షల విలువ చేసే వాచ్‌లు, 3 విల్లాలు, 3 ఫ్లాట్స్, 90 ఏకరాల భూమి గుర్తించామని చెప్పారు.

భూమి శివబాల కృష్ణ పేరుతో పాటు బినామీల పేరుపై ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు. మార్కెట్ ధర ప్రకారం భూముల విలువ సుమారు రూ. 60 కోట్లు ఉంటుందన్నారు. మొత్తం ఆస్తులు మార్కెట్ వాల్యూ ప్రకారం రూ. 75 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ఈ సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయన్నారు. శివబాల కృష్ణపై కేసు నమోదు చేసి, శుక్రవారం న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామన్నారు. తర్వాత కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు. కొన్ని విషయాలు ఆయన చెప్పలేదని... విచారణకు సహకరించలేదని.. కస్టడీకు తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర అన్నారు.

అవినీతి నిరోధక శాఖ వలకు అతిపెద్ద తిమింగలం చిక్కింది! హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌.. ప్రస్తుత రెరా సెక్రటరీ శివబాలకృష్ణ, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలలో ఏసీబీ ఆధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో.. ఎనిమిది బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల సోదాలు చేశారు. గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశముంది. మణికొండలోని ఆయన నివాస గృహంలో, అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో కూడా తనిఖీలు చేశారు. 2018-2023 కాలంలో హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివబాలకృష్ణ.. అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్టు వచ్చిన ఆరోపణలు, వాటిపై తాజా ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సుధీంద్ర ఆధ్వర్యంలో మణికొండలోని ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి, పదికి పైగా ఐఫోన్లు.. అత్యంత ఖరీదైన 50 వాచీలు.. కట్టలు కట్టలుగా నగదు.. ఆయన బీరువాలో 5 కిలోల బంగారు నగలు, 70 ఎకరాలకు సంబంధించిన భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jan 25 , 2024 | 08:30 AM