Share News

Mohan Babu: మోహన్ బాబు సిబ్బంది వీడియో హల్‌చల్.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - Dec 31 , 2024 | 10:37 AM

Telangana: మోహన్ బాబు వ్యక్తిగత సిబ్బంది జల్‌పల్లి అటవీప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. మోహన్‌బాబు వద్ద పనిచేసే మేనేజర్ కిరణ్‌పైనే ప్రధాన ఆరోషణలు ఉన్నాయి.

Mohan Babu: మోహన్ బాబు సిబ్బంది వీడియో హల్‌చల్.. ఏం జరిగిందంటే
Actor Manchu Mohan babu staff

హైదరాబాద్, డిసెంబర్ 31: నటుడు మోహన్ బాబు (Actor Mohan Babu) సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. జల్‌పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందులను మోహన్ బాబు సిబ్బంది వేటాడారు. అడవి పందిని వేటాది తీసుకెళ్లినట్లు మేనేజర్ కిరణ్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. ఎలక్ట్రిషన్ దుర్గాప్రసాద్ అడవి పందిని వేటాడి బంధించి మరీ తీసుకువెళ్లాడు. దీంతో కిరణ్, దుర్గ ప్రసాద్ ఇద్దరి చర్యలను తప్పుపడుతూ మంచి మనోజ్ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అడవి పందులను వేటాడొద్దని వారించినప్పటికీ మేనేజర్, ఎలక్ట్రిషన్ పట్టించుకోని పరిస్థితి. మరోవైపు మేనేజర్ కిరణ్ అడవి పందిని వేటాడి తీసుకువెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మోహన్ బాబు వ్యక్తిగత సిబ్బంది జల్‌పల్లి అటవీప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. మోహన్‌బాబు వద్ద పనిచేసే మేనేజర్ కిరణ్‌పైనే ప్రధాన ఆరోషణలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిషన్ దుర్గాప్రసాద్‌పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. కిరణ్‌, దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా అడవి పందులను వేటాడుతూ వాటి కలేబరాలను తీసుకెళ్తున్న అంశాలపైన ముందు నుంచి కూడా మనోజ్ అభ్యంతరం చెబుతున్నారు.


వేటాడవద్దని వారించినప్పటికీ కూడా కిరణ్‌, దుర్గాప్రసాద్ పట్టించుకోకుండా అడవి పందులను వేటాడుతున్నారని పలుమార్లు వారిని మందలించినట్లుగా తెలుస్తోంది. వారి చర్యలను తప్పుబడుతూ కిరణ్, దుర్గాప్రసాద్‌ ఇద్దరికీ కూడా మంచు మనోజ్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదు. ప్రస్తుతం ఆ వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఈ వీడీయోలు ఎప్పటివి, అడవి పందులను ఎప్పుడు వేటాడారు అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Ration Rice Case: దూకుడు పెంచిన పోలీసులు..


గత కొంతకాలంగా మోహన్‌బాబుకు సంబంధించిన ఫ్యామిలీలో వివాదం కొనసాగుతూనే ఉంది. మోహన్‌బాబు సిబ్బందిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా మోహన్ బాబు ఇంట్లో మంచు మనోజ్‌పై దాడి జరిగినప్పుడు వీడియో రికార్డులు, సీసీ టీవీ ఫుటేజ్‌లు మాయం చేశారని మోహన్ బాబు సిబ్బందిపై మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సీసీ ఫుటేజ్‌లను మాయం చేయడంలో కిరణ్ ప్రధాన పాత్ర ఉందని మనోజ్ ఫిర్యాదు చేశారు. ఈ అంశం కొనసాగుతుండగానే ప్రస్తుతం అడవి పందులను వేటాడి తీసుకువెళ్తున్నారనే అంశాలు సంచలనంగా మారాయి. అడవి పందులను వేటాడంపై మోహన్ బాబు మేనేజర్ కిరణ్, దుర్గాప్రసాద్‌లపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయో వేచి చూడాలి.


ఇవి కూడా చదవండి..

ఉగాది నుంచి ఉచితం

Ration Rice Case: దూకుడు పెంచిన పోలీసులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 10:37 AM