Share News

Suicide Case ఇంకా మిస్టరీగానే నటి శోభిత ఆత్మహత్య..

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:27 AM

కన్నడ నటి శోభిత మృతి కేసులో విచారణ చేస్తున్న గచ్చిబౌలి పోలీసులకు ఘటనా స్థలంలో సూసైడ్ నోటు లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్లో ‘మీరు చావాలి అనుకుంటే యు కెన్ డు ఇట్’ అని రాసుకున్న శోభిత.. సూసైడ్ నోటు ఆధారంగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా... భర్తతో విభేదాలా... సీరియల్స్ మూవీస్‌కు దూరంగా ఉండటమా.. అనే దానిపై విచారణ చేస్తున్నారు.

Suicide Case ఇంకా మిస్టరీగానే  నటి శోభిత ఆత్మహత్య..

హైదరాబాద్: కన్నడ సీరియల్ నటి (Kannada serial actress) శోభిత ఆత్మహత్య కేసు ( Shobhita Suicide Case) మిస్టరీ (Mystery) ఇంకా వీడలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య ఎలాంటి విబేధాలు లేవని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే నటి శోభిత డిప్రెషన్‌లో ఆత్మహత్య చేసుకుందా.. లేక ఇతర కారణాలతో చేసుకుందా.. అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. శోభిత భర్త సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల వాళ్ళ స్టేట్‌మెంట్లను పోలీసులు రికార్డు చేశారు.

మ్యాట్రిమోన్‌లో శోభిత ప్రొఫైల్ చూసి సుధీర్ రెడ్డి మ్యారేజ్ ప్రపోజల్ చేశారు. సుధీర్ రెడ్డి మ్యారేజ్ చేసుకున్న తర్వాత సీరియల్స్‌లో నటించడం మానేసిన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే శోభిత ఆత్మహత్య ముందు ఎవరెవరితో మాట్లాడిందన్న కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాగా శోభిత మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం గచ్చిబౌలి పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. శోభిత పార్ధివదేహాన్ని కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకువెళ్లనున్నారు.

కాగా కన్నడ నటి శోభిత మృతి కేసులో విచారణ చేస్తున్న గచ్చిబౌలి పోలీసులకు ఘటనా స్థలంలో సూసైడ్ నోటు లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్లో ‘మీరు చావాలి అనుకుంటే యు కెన్ డు ఇట్’ అని రాసుకున్న శోభిత.. సూసైడ్ నోటు ఆధారంగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా... భర్తతో విభేదాలా... సీరియల్స్ మూవీస్‌కు దూరంగా ఉండటమా.. అనే దానిపై విచారణ చేస్తున్నారు.


ఇదిలా ఉండగా కన్నడ బుల్లితెర నటి శోభిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి శ్రీరాంనగర్‌ కాలనీలోని సీ బ్లాక్‌లోని తన ఫ్లాట్‌లో ఆమె.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

'బ్రహ్మగంతు', 'నినిదలే' సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో ఆమె నటించింది. గతేడాది ఆమె వివాహం చేసుకున్నారు. భర్త సుధీర్‌తో కలిసి శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియ రాలేదు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బెంగళూరు తరలించనున్నారు. కర్ణాటకలోని సక్లేష్ పూర్‌కు చెందిన శోబిత గతేడాది పెళ్లి చేసుకుంది..

Updated Date - Dec 02 , 2024 | 11:27 AM