Share News

Allu Arjun: చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్.. ఆయనకు జైలులో కల్పించే సదుపాయాలు ఏమిటంటే

ABN , Publish Date - Dec 13 , 2024 | 03:49 PM

అల్లు అర్జున్‌ను రిమాండ్ ఖైదీల బ్యారక్‌‌లో ఉంచుతారు. సినీ నటుడు కావడంతో నేరస్తులకు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు దూరంగా అల్లు అర్జున్‌ను పెడతారు. రిమాండ్ ఖైదీల్లో ఎక్కువ నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు దూరంగా..

Allu Arjun: చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్.. ఆయనకు జైలులో కల్పించే సదుపాయాలు ఏమిటంటే
Allu Arjun

సంథ్య థియేటర్‌లో పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. అల్లు అర్జున్‌ను రిమాండ్ ఖైదీల బ్యారక్‌‌లో ఉంచుతారు. సినీ నటుడు కావడంతో నేరస్తులకు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు దూరంగా అల్లు అర్జున్‌ను పెడతారు. రిమాండ్ ఖైదీల్లో ఎక్కువ నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు దూరంగా ఉంచుతారు. విఐపీ కావడంతో ఆయనకు జైలులో ప్రత్యేక గదిని కేటాయించే అవకాశం ఉంది. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించడంతో పాటు జైలు చుట్టూ భారీ భద్రత ఏర్పాటుచేస్తారు. జైలు లోపల సైతం భద్రతను కట్టుదిట్టం చేస్తారు. అల్లు అర్జున్‌కు జైలులో అందరి రిమాండ్ ఖైదీలకు వడ్డించే భోజనం స్థానంలో ఇంటినుంచి భోజనాన్ని అనుమతించే అవకాశం ఉంటుంది. ఆయన పాపులర్ సినీ నటుడు కావడంతో ఆయనకు జైలులో కొన్ని ప్రత్యేక వసతులు కల్పించే అవకాశం ఉంది. రిమాండ్ ఖైదీల్లో ప్రముఖ వ్యక్తులు ఉంటే ఇంటి భోజనాన్ని అనుమతిస్తారు. రిమాండ్ ఖైదీలు అందరితో పాటు కాకుండా ఆయనకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తారు. ఆ గది చుట్టూ భద్రత ఏర్పాటుచేస్తారు.


హైకోర్టులో క్వాష్ పిటిషన్

ఓ వైపు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ను హాజరుపర్చగా మరోెవైపు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరం కేసు విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. కేసును క్వాష్ చేయాలని న్యాయవాదులు వాదించనున్నారు. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం ప్రకారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం ఆధారంగా అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయాలా లేదా అనే నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం 4గంటలకు క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పోలీసుల అరెస్ట్ విధానంపై కూడా విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.


బెయిల్ వస్తుందా..

అల్లు అర్జున్‌కు ఈరోజు బెయిల్ వస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇవాళ బెయిల్ వచ్చే అవకాశాలు లేనట్లు కనిపిస్తోంది. హైకోర్టులో నేరుగా బెయిల్ పిటిషన్ వేసే అవకాశం లేదు. ట్రయల్ కోర్టు బెయిల్ రిజక్ట్ చేసినప్పుడు మాత్రమే హైకోర్టును సంప్రదించాల్సి ఉంటుంది. క్వాష్ పిటిషన్‌పై విచారణ తర్వాత కేసును కొట్టివేస్తే అల్లు అర్జున్‌ వెంటనే విడుదలవుతారు. ఒకవేళ కోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తే మాత్రం ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 13 , 2024 | 04:11 PM