Share News

CM Revanth: ఎస్సైల పాసింగ్ అవుడ్ పరేడ్‌లో సీఎం కీలక ప్రకటన

ABN , Publish Date - Sep 11 , 2024 | 11:45 AM

Telangana: ప్రభుత్వ ఉద్యోగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది పూర్తి అయ్యేలోపు మరో 35 వేల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన రెండు నెలల్లోనే 30వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తుచేశారు.

CM Revanth: ఎస్సైల పాసింగ్ అవుడ్ పరేడ్‌లో సీఎం కీలక ప్రకటన
CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ప్రభుత్వ ఉద్యోగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది పూర్తి అయ్యేలోపు మరో 35 వేల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన రెండు నెలల్లోనే 30వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తుచేశారు. బుధవారం తెలంగాణ అకాడమీలో ఎస్సైల పాసింగ్ అవుడ్ పరేడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

AP News: ఏపీ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ


ఈ సందర్భంగా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘‘శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా మధుర జ్ఞాపకం’’ అని అన్నారు. తెలంగాణ సాధించుకున్న తరువాత విద్యార్థుల్లో, ఉద్యమకారుల్లో , ప్రజల్లో ఎంతో అసంతృప్తిగా ఉందని.. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తరువాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కొత్తగా నియమించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. తెలంగాణలో అవలక్షణాలతో డ్రగ్స్ బానిసలయ్యారన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ‘‘పోలీస్ ఉంటే ఉద్యోగం కాదు.. ఇది ఎమోషన్ , బాగోద్వేగం.. డ్రగ్స్ , గంజాయి, సైబర్ క్రైమ్‌పై మీరు బలంగా పని చేస్తారని మీ పై పూర్తి విశ్వాసం ఉంది’’ అని చెప్పుకొచ్చారు. తెలంగాణాలో పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ప్రజల కుల వృత్తులను ఆదుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. దేశ చరిత్రలోనే 18 వేల కోట్లు రూపాయలు కడుపు కట్టుకొని రైతుల అకౌంట్లలో జమ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

KTR: కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ పంచ్‌లు.. ఏమన్నారంటే?


547 సబ్ ఇన్స్‌పెక్టర్లు పాసింగ్ అవుట్ పరేడ్

తెలంగాణ పోలీస్ అకాడేమి నుండి ఈరోజు 547 సబ్ ఇన్స్‌పెక్టర్లు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో 145 మంది మహిళా ఎస్‌ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. 547 లో 401 మంది సివిల్ ఎస్‌ఐలు ఉన్నారు. అలాగే 547లో 472 మంది గ్రాడ్యూట్స్, 75 మంది పోస్ట్ గ్రాడ్యూఎట్స్ ఉన్నారు. వీరిలో 248 మంది ఎస్‌ఐలకు బీ టెక్ బ్యాక్‌ గ్రౌండ్ ఉంది. పరేడ్ కమాండర్‌గా మహిళా ఎస్‌ఐ పల్లి బాగ్యశ్రీ వ్యవహరించారు. ట్రైనింగ్ పూర్తిచేసుకున్న వారిలో అత్యధికంగా 26 నుంచి ముప్పై వయసు గల అభ్యర్థులు ఉన్నారు. 283 మంది 26 నుంచి 30 సంవత్సరాల వయసు కలవారు శిక్షణ పొందారు. అలాగే 182 మంది 25 ఏళ్ళ లోపు వయసున్నవారు సబ్ ఇన్స్‌పెక్టర్లుగా శిక్షణ పొందారు.


ఇవి కూడా చదవండి..

Godavari: గోదావరి ఉగ్రరూపం.. గంట గంటకూ పెరుగుతున్న వరద ప్రవాహం..

Hyderabad: సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ.. ఎందుకంటే?

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 11 , 2024 | 11:47 AM