Medicare Hospital: హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో దారుణం
ABN , Publish Date - Nov 06 , 2024 | 09:43 AM
అనారోగ్యంతో మెడికవర్ ఆస్పత్రికి వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇప్పటి వరకు మూడులక్షలకుపైగా కుటుంబసభ్యులు ఆస్పత్రికి డబ్బులు కట్టారు. మిగతా 4 లక్షల రూపాయలు కడితేనే డెడ్ బాడీ ఇస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. దీంతో నాగప్రియ కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గాంధీతో చెప్పించారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం వినలేదు.
హైదరాబాద్: హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ (Hi-Tech City Medicover Hospital)లో దారుణం (Atrocious) జరిగింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ (Junior Dr. Naga Priya) చికిత్స పొందుతూ మృతి (Died) చెందింది. ఇప్పటి వరకు మూడులక్షలకుపైగా కుటుంబసభ్యులు ఆస్పత్రికి డబ్బులు కట్టారు. మిగతా 4 లక్షల రూపాయలు కడితేనే డెడ్ బాడీ ఇస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. దీంతో నాగప్రియ కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గాంధీతో చెప్పించారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం వినలేదు.
అర్ధరాత్రి మరో రూ. మూడు లక్షలు కట్టాలని, లేదంటే వైద్యం ఆపేస్తామంటూ ఆస్పత్రి వర్గాలు నాగప్రియ కుటుంబీకులకు ఫోన్ చేశారు. ఉదయాన్నే లక్ష రూపాయలు కట్టిన తరువాత పేషంట్ మృతి చెందింది. మిగతా డబ్బు అంటూ మెడికవర్ హాస్పిటల్ వర్గాలు బేరం పెట్టాయి. వైద్యం ఆపేయడం వల్లే నాగప్రియ చనిపోయిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మెడికవర్ ఆస్పత్రి వద్ద టెన్షన్ నెలకొంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణం
ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు..
ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982 రద్దుకు ప్రభుత్వ నిర్ణయం
గెలుపు దిశగా ట్రంప్.. ఆ రాష్ట్రాల్లో భారీ లీడ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News