Share News

Bhanu kiran: చంచల్‌గూడ జైలు నుంచి భాను కిరణ్ విడుదల

ABN , Publish Date - Nov 06 , 2024 | 03:05 PM

Telangana: మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్ చంచల్‌గూడ జైలు నుంచి బుధవారం విడుదలయ్యాడు. ఈ కేసులో 12 ఏళ్లుగా భాను కిరణ్ జైలులోనే ఉన్నాడు. ఇటీవల నాంపల్లి కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు విడుదలయ్యాడు.

Bhanu kiran: చంచల్‌గూడ జైలు నుంచి భాను కిరణ్ విడుదల
Bhanu Kiran released from Chanchalguda Jail

హైదరాబాద్, నవంబర్ 6: మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ విడుదలయ్యాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత భాను కిరణ్ చంచల్‌‌గూడా జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. సూరి హత్య కేసులో 12 ఏళ్ల పాటు జైలులో ఉన్న భానుకు ఇటీవల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో కాసేపటి క్రితమే ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.

Supreme Court: ఆ వాహనాలు నడిపేవారికి ప్రత్యేక లైసెన్స్ అక్కర్లేదు: సుప్రీం కీలక తీర్పు


కాగా.. మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. సీఐడీ ఆమ్స్ ఆక్ట్ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సూరి మర్డర్ కేసులో న్యాయస్థానం జీవిత ఖైదు విధించగా.. 12 సంవత్సరాలుగా భానుకిరణ్ చంచల్ గూడ జైలులోనే ఉంటున్నారు. గత 12 ఏళ్లుగా జైలులోనే ఉన్నానని తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా భాను కిరణ్ సుప్రీం కోర్టు, హైకోర్టును ఆశ్రయించాడు. అయితే బెయిల్‌పై స్థానిక కోర్టులో తేల్చుకోవాలని సుప్రీం న్యాయస్థానం తెలిపింది. ఈనెల 11న ఈ కేసు (జీవిత ఖైదు) కూడా విచారణకు రానుంది.


2011 సంవత్సరంలో జరిగిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2018 డిసెంబర్‌లో ఆయనకు నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది. 2011 జనవరి 4న మద్దెల చెరువు సూరిని హత్య చేశాడు. అప్పట్లో ఈ వార్త పెను సంచలనంగా మారింది. దివంగత నేత, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి నిందితుడు. జనవరి 4న హైదరాబాద్‌ సనత్‌నగర్‌ నవోదయ కాలనీలో సూరిని భాను కిరణ్ కాల్చిచంపాడు.


పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి ప్రధాన నిందితుడు. తన కుటుంబంలో ఉన్న అందరినీ హత్య చేశాడనే కోపంతో పరిటాల రవిని 2005లో సూరి కాల్చి చంపాడు. ఆపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇక ప‌రిటాల ర‌విని హ‌త్య చేసిన కేసులో జైలు జీవితం గ‌డిపి బెయిల్ మీద‌ బ‌య‌ట‌కు వ‌చ్చిన సూరిని 2011 జనవరి 4న భాను కిర‌ణ్ కాల్చి చంపాడు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు 2018లో భాను కిరణ్‌కు జీవిత ఖైదు విధించింది. దీంతో అప్పటి నుంచి భాను కిరణ్‌ చంచల్‌గూడ జైలులోనే ఉన్నాడు. అయితే తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా నాంపల్లి కోర్టులో భాను పిటిషన్‌ వేయగా.. విచారణ జరిపిన కోర్టు సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసులో భాను కిరణ్‌కు బెయిల్‌ను మంజూరు చేసింది.


ఇవి కూడా చదవండి..

Hyderabad: గోల్డ్‌ స్కీమ్‌లో చేరాలని ఫోన్లు వస్తున్నాయా.. అయితే..

Formula E Racing: దూకుడు పెంచిన ఏసీబీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 06 , 2024 | 03:07 PM