Bhawariya gang: హైదరాబాద్‌లో మళ్లీ రెచ్చిపోతున్న భవారియా గ్యాంగ్..
ABN , Publish Date - Jun 18 , 2024 | 05:45 PM
నగరంలో భవారియా గ్యాంగ్ (Bhawariya gang) మళ్లీ హల్‌చల్ చేస్తోంది. గంటల వ్యవధిలోనే పెద్దఎత్తున చైన్‌స్నాచింగ్(Chain snatching)లకు ముఠా పాల్పడింది. హైదరాబాద్ (Hyderabad)తోపాటు శివారు ప్రాంతాల్లో మహిళలే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. జవహర్‌నగర్, శామీర్‌పేట్, మెహిదీపట్నంలో వరస చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ మహిళలను హడలెత్తిస్తున్నారు.
హైదరాబాద్: నగరంలో భవారియా గ్యాంగ్(Bhawariya gang) మళ్లీ హల్‌చల్ చేస్తోంది. గంటల వ్యవధిలోనే పెద్దఎత్తున చైన్‌స్నాచింగ్(Chain snatching)లకు ముఠా పాల్పడింది. హైదరాబాద్(Hyderabad)తోపాటు శివారు ప్రాంతాల్లో మహిళలే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. జవహర్‌నగర్, శామీర్‌పేట్, మెహిదీపట్నంలో వరస చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ మహిళలను హడలెత్తిస్తున్నారు. యూపీకి చెందిన భవారియా, ధార్ గ్యాంగ్‌లు నగర శివారు ప్రాంతాల్లో మకాం వేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందాలతో వేట ప్రారంభించారు.
ఎక్కడెక్కడ చోరీలకు పాల్పడ్డారంటే..?
వరస దోపిడీలతో భవారియా గ్యాంగ్ మరోసారి హైదరాబాద్ నగరంపై విరుచుకుపడింది. దొంగిలించిన ద్విచక్రవాహనంపై ముఠా సభ్యులు చోరీలకు పాల్పడుతున్నారు. శనివారం ఒక్క రోజే జవహర్‌నగర్, చీర్యాల, శామీర్‌పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో వరసగా నాలుగు చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గజ్వేల్ వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. గంటల వ్యవధిలోనే చీర్యాలకు వెళ్లి అక్కడ ఒక మహిళ మెడలోనుంచి బంగారు గొలుసు కొట్టేశారు. తర్వాత ఎటు వెళ్లారో పోలీసులకు అంతు చిక్కలేదు.
చోరీ చేసిన ద్విచక్రవాహనంపై తిరుగుతుండడంతో సిద్ధిపేట, రాచకొండ, సైబరాబాద్ సహా వివిధ కమిషనరేట్ల పరిధిలో బైకు అదృశ్యం కేసులపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల సోలాపూర్‌లో వరస దాడులకు పాల్పడిన ఈ ముఠాలో కొంత మంది నగరానికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
గతంలోనూ ఇదే తరహా చోరీలు..
2023 జనవరి 7న హైదరాబాద్, రాచకొండ పరిధిలో ఇదే తరహాలో ఇద్దరు ద్విచక్రవాహనంపై వచ్చిన రెండు గంటల వ్యవధిలో ఆరుగురు మహిళల నుంచి గొలుసులు ఎత్తుకెళ్లారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన భవారియా గ్యాంగ్‌గా గుర్తించారు. వరస దోపిడీల అనంతరం వారు అప్పుడు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోయారు. దీంతో యూపీ, దిల్లీకి ప్రత్యేక బృందాలు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇదే ముఠా సభ్యులు నాలుగు చోరీలు చేసి నగరవాసులను హడలెత్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి గోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలతో నగరాన్ని జల్లెడ పడుతున్నారు.
ఇది కూడా చదవండి: