Share News

CM Revanth: సీఎం రేవంత్, మంత్రులపై మహేశ్వర రెడ్డి నిప్పులు

ABN , Publish Date - Aug 26 , 2024 | 04:14 PM

హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. పది మందిలో ప్రతి నలుగురు హైడ్రా గురించి, సీఎం రేవంత్ రెడ్డి గురించి డిస్కష్ చేస్తున్నారు. హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తేనె తుట్టేనే కదిపారని చాలా మంది రాజకీయ నేతలు ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇతరులు కబ్జా చేసిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సీఎం రేవంత్.. మీకు దమ్ముంటే ఆ నిర్మాణాలు కూల్చివేయాలని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు.

CM Revanth: సీఎం రేవంత్, మంత్రులపై మహేశ్వర రెడ్డి నిప్పులు
Maheshwar Reddy

హైదరాబాద్: హీరో నాగార్జున (Nagarjuna) ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. పది మందిలో ప్రతి నలుగురు హైడ్రా గురించి, సీఎం రేవంత్ రెడ్డి గురించి డిస్కష్ చేస్తున్నారు. హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తేనె తుట్టేనే కదిపారని చాలా మంది రాజకీయ నేతలు ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇతరులు కబ్జా చేసిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సీఎం రేవంత్.. మీకు దమ్ముంటే ఆ నిర్మాణాలు కూల్చివేయాలని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు.


CM Revanth Reddy.jpg


పాతబస్తీలో చెరువుల కబ్జా..

సీఎం రేవంత్ రెడ్డికి దూకుడు ఎక్కువ అని బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఆ దూకుడుతనమే ఇబ్బందిగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. దాంతోపాటు పాతబస్తీలో చెరువులు కబ్జాకు గురయ్యాయని మహేశ్వరరెడ్డి గుర్తుచేశారు. ఆ కబ్జాలు తొలగించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని నిలదీశారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ కాలేజీ నిర్మించారని గుర్తుచేశారు. ఆ కాలేజీని కూలుస్తారా అని అడిగారు. మజ్లిస్‌ పార్టీతో కాంగ్రెస్ సఖ్యంగా ఉంటోంది. ఈ క్రమంలో ఓవైసీ కాలేజీని కూలగొడతారా అని మహేశ్వర రెడ్డి ఛాలెంజ్ చేశారు.


HYDRA.jpg


ఇందుకేనా..?

హైడ్రాకు అంత హైప్ తీసుకొచ్చేందుకు కారణం ఇతర అంశాలు పక్కదారి పట్టించేందుకేనని మహేశ్వర రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కూల్చివేతల గురించి జనం చర్చించుకుంటుంటే.. ఇతర అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉండదని వివరించారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే హైడ్రాను తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. రుణమాఫీ కాక రైతులు ఇబ్బంది పడ్డారని మహేశ్వర రెడ్డి గుర్తుచేశారు. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తలొక విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


ఎందుకీ తేడా..?

రాష్ట్రంలో రుణమాఫీ అయ్యింది ఎంత..? ఇంకా ఎంతమందికి రుణం మాఫీ చేయాల్సి ఉందని మహేశ్వర రెడ్డి నిలదీశారు. రూ.31 వేల కోట్లు మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మంత్రులెమో రూ.17 వేల కోట్లు మాఫీ చేశామని అంటున్నారు. ఈ రెండు ప్రకటనల్లో ఏది నిజం..? ఎవరి మాటలను నమ్మాలని నిలదీశారు. మంత్రివర్గంలో ఓ ఫేక్ మంత్రి ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ఇవి కూడా చదవండి

CMRF Scam: సీఎం‌ఆర్‌ఎఫ్ స్కాంలో 17 ఆస్పత్రులపై కేసులు నమోదు

Kodandareddy: హైడ్రాపై ఎంఐఎం, బీఆర్‌ఎస్‌వి అడ్డగోలు విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2024 | 04:15 PM