TS Politics: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. కమలనాథుల ప్లాన్ ఇదేనా..?
ABN , Publish Date - Jan 29 , 2024 | 07:50 PM
పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ(BJP) ఫోకస్ పెట్టింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. పది ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా కమలం ప్రణాళికలు రచిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ(BJP) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. పది ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణలో బలపడేందుకు చాన్స్ ఉందని భావిస్తున్న బీజేపీ హైకమాండ్.. పార్లమెంట్ ఎన్నికలపై ఇందుకోసం ఏ చిన్న అవకాశం వచ్చినా సరే వదులుకోవట్లేదు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్టప్‌తో.. భారీగా పార్లమెంట్ సీట్లు కొల్లగొట్టేలా కాషాయదళం వ్యూహాలు రచిస్తోంది. ప్లాన్‌లో భాగంగా ఫిబ్రవరి 10 నుంచి 19 వరకు తెలంగాణలో బీజేపీ బస్సు యాత్ర చేపడుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను ధీటుగా ఢీకొట్టేలా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 10న భువనగిరి, 13న మల్కాజ్‌గిరి, 17,18 తేదీల్లో హైదరాబాద్, 19న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో జాతీయ, రాష్ట్ర అగ్రనేతలు ప్రచారానికి వచ్చేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది.