BRS: కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
ABN , Publish Date - Dec 08 , 2024 | 08:06 AM
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చార్జ్ షీట్ సిద్ధం చేసింది. ఆదివారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేస్తారు. హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి మాట మార్చుతున్నారని హరీష్ రావు విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ సర్కార్ (Congress Govt.) ఏడాది పాలనపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) చార్జ్ షీట్ (Charge Sheet) సిద్ధం చేసింది. ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మాజీమంత్రి హరీష్ రావు (Harish Rao) చార్జ్ షీట్ విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తదితరులు పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయటంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపించింది. హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి మాట మార్చుతున్నారని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ తీరును అసెంబ్లీలో.. ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని గులాబీ పార్టీ నిర్ణయిందని హరీష్ రావు స్పష్టం చేశారు.
దివ్యాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచాలి..
కాగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం (ఆర్‌ఆర్‌ఆర్)లో భాగంగా తక్కువ ధరకే తమ భూములను లాక్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని పలువురు బాధితులు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు.. తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం పుప్పాల్‌గూడలో నివాసం ఉంటున్న మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధితులకు న్యాయం చేయకపోతే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్న 4,016 రూపాయల పెన్షన్‌ను ఆరువేల రూపాయలకు పెంచాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈనెల 26న జరగనున్న దివ్యాంగుల మహా ధర్నాకు తాను తప్పనిసరిగా హజరవుతానని తనను కలిసిన దివ్యాంగుల సంఘం నాయకులకు ఆయన హమీ ఇచ్చారు.
దిశానిర్దేశం
మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆదివారం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో మధ్యహాన్నం 1గంటకు సమావేశం అవుతారు. సోమవారం నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో బీఆర్ఎస్ నేతలు అవలంభించాల్సిన వ్యహ్యాంపై సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఇంకొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారన్న ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత అలెర్ట్ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ భరోసా ఇవ్వనున్నారు. ప్రజా సమస్యలే లక్ష్యంగా సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరైయ్యే అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బోరుగడ్డ అనిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
మా పోస్టులు రెవెన్యూ వాళ్లకా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News