Share News

BRS: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశాలు తిరిగి ప్రారంభం

ABN , Publish Date - Jan 17 , 2024 | 08:28 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశాలు తిరిగి బుదవారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరగనుంది. ఇప్పటికే పది పార్లమెంట్ నియోజక వర్గాల సమీక్షలు పూర్తి చేశారు.

BRS: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశాలు తిరిగి ప్రారంభం

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశాలు తిరిగి బుదవారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరగనుంది. ఇప్పటికే పది పార్లమెంట్ నియోజక వర్గాల సమీక్షలు పూర్తి చేశారు. సంక్రాంతి సెలవుల తర్వాత గులాబీ పార్టీ లోక్ సభ సమీక్ష సమావేశాలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. కనుమ పండుగ సందర్భంగా 16వ తేదీన జరగాల్సిన నల్గొండ సమీక్ష సమావేశం 22వ తేదీకి వాయిదా వేశారు.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో అలంపూర్ గద్వాల స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది.

కాగా తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగే సమీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కే కేశవరావు, మధుసూదనా చారి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి కడియం శ్రీహరి, బండ కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 08:28 AM