Malkajgiri MLA: మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు
ABN , Publish Date - Mar 07 , 2024 | 11:58 AM
అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళన నిర్వహించింది. ఆందోళన కార్యక్రమంలోఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్: అల్వాల్ (Alwal) పోలీస్ స్టేషన్‌లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే (Malakajgiri MLA) మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy)పై కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ (GHMC) అల్వాల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ (BRS) ఆందోళన నిర్వహించింది. ఆందోళన కార్యక్రమంలోఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అల్వాల్ సర్కిల్ ఉప కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ఆయనయత్నించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే మర్రి, జీహెచ్ఎంసీ (GHMC) అల్వాల్ సర్కిల్ ఉప కమిషనర్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Hyderabad: అక్బరుద్దీన్‌తో కలిసి టీ తాగుతావా? మంత్రి పొన్నంపై గ్రేటర్ కాంగ్రెస్ నేతల గరం
అనంతరం పోలీస్ స్టేషన్‌లో అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేశారు. వినతి పత్రం ఇచ్చే విషయమై తనను ఘోరావ్ చేయడమే కాకుండా బెదిరించి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు మేరకు రాజశేఖర్ రెడ్డిపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసుపై రాజశేఖర రెడ్డి స్పందించారు. తాను అధికారులను బెదిరించలేదని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టలేదని వివరించారు.
KTR: లోటు వర్షపాతమా?.. సీఎం మాటలు విడ్డూరమంటూ కేటీఆర్ ట్వీట్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.