CMRF: సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై ఇలా చేయాలి..!!
ABN , Publish Date - Jul 03 , 2024 | 09:03 PM
సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పారదర్శకంగా లబ్ధిదారులకు అందేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేస్తామని ప్రకటించింది. సీఎంఆర్ఎఫ్ కోసం ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
హైదరాబాద్: సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పారదర్శకంగా లబ్ధిదారులకు అందేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేస్తామని ప్రకటించింది. సీఎంఆర్ఎఫ్ కోసం ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నిధులు పక్కదారి పట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు స్పష్టం చేశారు. దాంతో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారిక వెబ్ సైట్ రూపొందించింది.
నిధులు పక్కదారి పట్టొద్దు
గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పక్కదారి పట్టాయి. ఈ సారి అలా జరగొద్దని తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వెబ్ సైట్‌లో దరఖాస్తులను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రత్యేక ఫార్మాట్ అందుబాటులో ఉంచారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల కోసం ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్సీ రికమండ్ చేస్తే.. ఆ లేఖలను దరఖాస్తుకు విధిగా జతచేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ అప్లికేషన్‌లోనే దరఖాస్తుదారుడు బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత దరఖాస్తుదారుడికి ఓ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్స్ సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
ఆస్పత్రికి అప్లికేషన్లు
ఆన్ లైన్ అప్లికేషన్‌ను చికిత్స తీసుకున్న ఆస్పత్రికి పంపిస్తారు. చికిత్స తీసుకుంది.. నిజమో కాదో ధృవీకరిస్తారు. సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ పరిశీలించి అధికారులు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. అప్లికేషన్ అఫ్రూవ్ అయిన తర్వాత చెక్కు తయారు చేస్తారు. దరఖాస్తుదారుడు ఇచ్చిన బ్యాంక్ ఖాతా నంబర్‌తో చెక్కు తయారు చేస్తారు. ఆ చెక్కును దరఖాస్తుదారుడికి అందజేస్తారు. నిధులు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
CM Chandrababu: అమరావతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News AND Telugu News