Revanth Reddy: చంద్రబాబుకు రోశయ్య ఏం చెప్పారంటే..: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Dec 04 , 2024 | 01:58 PM
‘‘చూడయ్య చంద్రబాబు నాకు చీరాలలో ఏమీ లేదు.. 50 ఏళ్ళ క్రితం అక్కడున్నది అమ్ముకుని హైదరాబాద్‌కు వచ్చి.. అమీర్‌పేట ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నా.. నేను హైదరాబాద్ వాడినే తప్ప.. నాకు ఆ రాష్ట్రమా.. ఈ ప్రాంతమా అనేది లేదని.. రెండు ప్రాంతాలు నాకు సమానమే’’ అని రోశయ్య చంద్రబాబుకు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమం (Rosaiah death anniversary) బుధవారం హైటెక్స్ (Hitex)లో రోశయ్య మెమోరియల్ ఫోరం, ఆర్యవైశ్య కార్పొరేషన్ (Arya Vaishya Corporation) ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy Bhatti Vikramarka), మంత్రులు (Ministers), ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చంద్రబాబు నాయుడుతోకలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రోశయ్య ఇంటికి వెళ్లానని, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు రోశయ్య, చంద్రబాబుకు ఒక మాట చెప్పారన్నారు.
‘‘చూడయ్య చంద్రబాబు నాకు చీరాలలో ఏమీ లేదు.. 50 ఏళ్ళ క్రితం అక్కడున్నది అమ్ముకుని హైదరాబాద్‌కు వచ్చి.. అమీర్‌పేట ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నా.. నేను హైదరాబాద్ వాడినే తప్ప.. నాకు ఆ రాష్ట్రమా.. ఈ ప్రాంతమా అనేది లేదని.. రెండు ప్రాంతాలు నాకు సమానమే’’ అని చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు నికార్సైన హైదరాబాది ఎవరైనా ఉన్నారంటే అది రోశయ్యేనని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. అలాంటి వ్యక్తికి హైదరాబాద్‌లో విగ్రహం లేకపోవడం రాష్ట్రానికి లోటని.. రాష్ట్రంలో మంచి ప్రాంతం చూసి.. ప్రభుత్వానికి సూచన చేయాలని నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డికి ఏ ప్రాంతంలో రోశయ్య విగ్రహం పెడితే బాగుంటుందో సూచన చేస్తే తప్పకుండా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే నాల్గవ వర్ధంతి లోపు రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆయన ఆర్యవైశ్య మిత్రులకే కాదు.. అందరికీ స్ఫూర్తి అని సీఎం కొనియాడారు. వార్డు మెంబర్ నుంచి... పార్లమెంట్ మెంబర్ వరకు.. రాష్ట్ర మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు రోశయ్య ఒక స్ఫూర్తి అని.. అలాంటి వ్యక్తుల విగ్రహాలు ఉండడం ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చినవాళ్లమవుతాయని అన్నారు. రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆర్యవైశ్య మిత్రులకు మాట ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భూ ప్రకంపనలు.. కారణం చెప్పిన సైంటిస్టు
కొడాలి నాని అనుచరుల వరుస అరెస్టులు..
ఆ ఊరి నిండా సమాధులే.. వింత గ్రామం..
జగన్ బంధువుల్లో నోటీసుల కలకలం..
రాజధాని నివాసిగా ఏపీ సీఎం చంద్రబాబు
కోహ్లీకి గాయం.. రెండో టెస్ట్‌కు డౌట్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News